గత కొన్ని రోజుల నుంచి భారత్-చైనా సరిహద్దుల్లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. భారత సైన్యాన్ని రెచ్చగొడుతూ చైనా అంతకంతకు భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అదే సమయంలో భారత సైన్యం మాత్రం చైనా సైన్యాన్ని తిప్పికొట్టడం లేదు. అయితే భారత భూభాగాన్ని ఆక్రమించుకోకుండా చైనా సైన్యం తో సరిహద్దులో సైనికుడు ప్రాణాలను ఘనంగా పెట్టి పోరాడుతుంటే భారతదేశానికి చెందిన కొంతమంది మేధావులు ఘర్షణ పడటం ఎందుకు ఆ భూమిని చైనాకు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని ఒక వింత వాదన వినిపిస్తున్నారు.

 

 అయితే రాబోయే  ఐదేళ్లు ఎంతో కీలకం అటువంటిది ప్రస్తుతం విశ్లేషకులు చెబుతున్నారు. అయితే దీనికి కారణం ఏమిటి అనేది సైనికులు స్వయంగా చెబుతున్నారు, ఒకపక్క చైనా భారత భూభాగంలోకి చొచ్చుకొని ఉన్నప్పటికీ భారత్ ఎందుకు చైనాను తిప్పికొట్టే లేక పోతున్నాము. చైనాను దెబ్బకు దెబ్బ తీయడం పెద్ద సమస్య కాదు అని సైన్యం చెబుతోంది... కానీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది సైన్యం కాదు అని రాజకీయ నాయకులే అని అంటున్నారు సైన్యాధికారులు, ముఖ్యంగా జనరల్ బిక్రమ్ సింగ్ చెబుతున్నటువంటి ఒక కీలక పాయింట్ ఏమిటి అంటే... ప్రస్తుతం భారత దేశానికి సంబంధించి ఒక కీలకమైన ఇటువంటి పరిస్థితిలో ఉన్నామని చెబుతున్నారు

 

 ప్రస్తుతం బార్డర్ లో  3 వేల కిలోమీటర్లకు పైగా ఒక రోడ్డు నిర్మిస్తున్నామని..  ఇది సంపూర్ణంగా పూర్తవడానికి ఐదేళ్ల సమయం పడుతుందని ఆ లోగా బార్డర్ లో  మౌలిక వసతులు కూడా కల్పించడానికి చర్యలు చేపడుతున్నామని అంటున్నారు సైనికాధికారులు. ఇలా 1 డివిజన్ లో  10 వేల మంది సైనికులు ఉంటారు. ఓవైపు చైనా సరిహద్దుల్లో  ఎన్నో నిర్మాణాత్మక పనులు చేపడుతుంది భారత సైన్యం మాత్రం సైలెంట్ గానే ఉండిపోయింది. రానున్న ఐదేళ్లలో భారతదేశం సరిహద్దుల్లో మౌలిక వసతుల కల్పన తర్వాత ఎన్నో నిర్మాణాలు చేపడుతుంది  కాబట్టి ఇక భారత్ కి తిరుగు ఉండదు అని అంటున్నారు సైనికాధికారులు. ఇది చైనా ముందుగా అర్థం చేసుకుంది కాబట్టి ప్రస్తుతం ఇలా ఘర్షణకు దిగుతోంది అని అంటున్నారు అది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: