వైసీపీ పార్టీ ప్రాంతీయ పార్టీలను కానీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తనకి విజయసాయిరెడ్డి షోకాజ్ నోటీసులు పంపించడం వల్ల ఇటీవల రఘురామకృష్ణం రాజు వెటకారపు చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. షోకాజ్ నోటీసులు పై కేంద్ర ఎన్నికల సంఘానికి పార్టీ పై ఫిర్యాదు చేయడానికి కూడా రఘురామకృష్ణంరాజు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ లో సభ్యుడిని అయితే తనకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున షోకాజ్ నోటీసులు అధిష్టానం పంపించడంతో ఆ లెటర్ ఎలక్షన్ కమిషనర్ కు పంపించడంతో వైసీపీ పార్టీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చినట్లయింది.

 

మరోపక్క ఇదే విషయంలో కేంద్ర పెద్దలతో కూడా ఫిర్యాదు చేయాలని రఘురామకృష్ణంరాజు అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు గారు ఎంత ఇబ్బందులపాలు చేయాలని వైసిపి పార్టీ పై కేంద్రం దగ్గర ప్రయత్నాలు చేసినా పప్పులు ఏమి ఉడకవని… చాలా మంది మేధావులు అంటున్నారు.

 

ఎందుకంటే రాజ్యసభలో బీజేపీ, వైసీపీ పార్టీ సహాయం ఎంతో అవసరం భవిష్యత్తులో ఉందని, రఘురామకృష్ణంరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా గల్లీ పార్టీ టైపులో ప్రజెంట్ వైసీపీ లేదని.. పార్లమెంటులో అత్యధిక స్థానాలు కలిగిన నాలుగో అతిపెద్ద పార్టీగా, రాజ్యసభలో కూడా అదే రీతిలో ఆరు రాజ్యసభ స్థానాలు కైవసం చేసుకుని కీలకపాత్ర పాత్ర కేంద్రంలో వైసీపీ పోషిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజుగారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని కలవడం జరిగింది.  కలిసిన గాని వారి నుండి పెద్దగా ప్రయోజనం రఘురామకృష్ణంరాజు ఆశించటం అనవసరమని చెబుతున్నారు. ఈపాటికే ఢిల్లీలో చక్కర్లు కొట్టిన రఘురామకృష్ణంరాజు కి ఈ విషయం అర్థం అయి ఉంటుందని, అందువల్లే ఢిల్లీలో మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు జగన్ మీద కాకుండా టాపిక్ మొత్తం విజయసాయి రెడ్డి మీద అన్నట్టుగా వ్యాఖ్యలు ఉన్నాయని మేధావులు చెప్పుకొస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: