చైనా మహమ్మారి అని తెలుసు. ఎంతటి మహమ్మారి అంటే కరొనా వైరస్ అంటే ప్రమాదకారి అని అంటారు. అవును ఇంతకీ కరోనా వైరస్ కూడా పుట్టింది చైనాలోనే కదా. సరిగ్గా సరిపోయింది ఈ పోలిక కూడా. ఎందుకంటే అది కూడా తెలియకుండానే, ఎటువంటి హెచ్చరికలు లేకుండానే మనిషి లోపలికి వచ్చేసి అతలాకుతలం చేస్తుంది, ప్రాణాలు కూడా తీస్తుంది. చైనా కూడా అదే తీరుగా ఉందని అంటున్నారు. అందుకే కపటత్వంతో గాల్వాన్ లోయ సరిహద్దుల్లో కుట్ర చేసి మరి ఇరవైమంది భరత జవాన్లను పొట్టన పెట్టుంది.

 

అసలు ఇంతకీ చైనా మన ప్రధాని, రాజకీయ గండర గండడు మోడీని ఎలా మోసం చేసిందన్నది ఒక పెద్ద ప్రశ్న. మోడీ ప్రధాని అయిత తరువాత దేశ దేశాలు తిరిగారు. అందరితో పరిచయాలు పెంచుకున్నారు. అలాగే ఏ ప్రధాని కూడా ఎక్కువ సార్లు వెళ్ళనంతగా చైనా వెళ్ళారు. అక్కడ అధిపతులతో అన్ని రకాలుగా చర్చలు జరిపారు, హిందీ చైనీ బాయీ బాయీ అన్నారు. 

 

ఇదంతా జరిగిన తరువాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కూడా భారత టూర్ కి గత ఏడాది వచ్చారు. మహాబలేశ్వరంలో ఇద్దరు దేశాధినేతలూ కలసి చాయ్ తాగుతో చల్లని వేళ  కులసా కబుర్లు చెప్పుకున్నారు. ఒక్కటిగా అడుగులు ముందుకు వేయాలనుకున్నారు. ఏది చేసినా కలసి చేయాలనుకున్నారు. అసలు ఇద్దరూ కలిస్తే ఏముంది, ప్రపంచం మొత్తం బలదూర్ అని చైనా నమ్మించింది. మోడీ సైతం మంచి మనసుతో స్నేహస్తం అందించారు. 

 

సీన్ కట్ చేస్తే గాల్వాన్ లోయ దాకా వచ్చేసిక చైనా మూకలు గీత దాటేశాయి. భారత్ కే పరీక్ష పెట్టేసాయి. అది కూడా భరించి సరేనని శాంతి చర్చలకు ఓ వైపు ప్రధాని మోడీ ప్రయత్నిస్తూంటే మళ్ళీ విశ్వాసఘాతుకానికి పాల్పడ్డాయి. గాల్వాన్ లోయ  నుంచి బలగాలను వైదొలుగుతామని చెప్పిన చైనా నమ్మించి వంచించింది. భారత జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఇది చైనాకు అలవాటైన విద్య. మరి దీనికి మోడీ మార్క్ ప్రతీకారం ఉంటుందని అంతా అంటున్నారు.'

 

మరింత సమాచారం తెలుసుకోండి: