తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంది.టెస్టుల సంఖ్య పెద్దగా పెరుగకపోయినా భారీగా పాజిటివ్ కేసులు వస్తుండడంతో ఆందోళన నెలకొంది. ఇక కొన్ని రోజుల ముందు వరకు హైదరాబాద్ వరకే పరిమితమైన కరోనా  ప్రస్తుతం అన్ని జిల్లాలకు విస్తరించింది. నల్గొండలో ఈఒక్క రోజే 35 కేసులు నమోదు కావడంతో  జిల్లా వాసుల్లో కరోనా భయం స్టార్ట్ అయ్యింది.
 
ఇక ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1087 పాజిటివ్ కేసులు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది అందులో అత్యధికంగా జిహెచ్ఎంసి లో 888,రంగారెడ్డి లో 74,మేడ్చల్ లో 37కేసులు బయటపడ్డాయి. ఈరోజు మొత్తం 3923శాంపిల్ టెస్టులు చేశారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 13436కరోనా కేసులు నమోదవ్వగా అందులో 4928మంది బాధితులు కోలుకున్నారు.ప్రస్తుతం 8265కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనాతో 6గురు మరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 243కు చేరింది. 
ఇక దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఈ ఒక్క రోజే 19000కుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 527000 కరోనా కేసులు నమోదుగా 16000 మరణాలు చోటుచేసుకున్నాయి. కరోనా రోజు రోజుకి తీవ్ర రూపం దాల్చుతుండడంతో కొన్ని రాష్ట్రాలు మళ్ళీ లాక్ డౌన్ బాట పట్టాయి అందులో భాగంగా పశ్చిమ బెంగాల్ , జార్ఖండ్ ,జులై 31వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు  ప్రకటించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: