జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చాలా సానుకూలంగానే వ్యవహరిస్తూ ఉంది. రాజకీయంగా ఒకపక్క జగన్ తమ మిత్రపక్షం అంటూ మరొక పక్క విమర్శలు చేస్తూనే ఉన్నారు బీజేపీ నాయకులు. అదేవిధంగా ఎలక పార్టీ నాయకులు బీజేపీ పార్టీ పెద్దలు జగన్ కి అపాయింట్మెంట్ లేస్తూనే మరొకపక్క ఆఖరి నిమిషంలో రద్దు చేస్తూనే వ్యవహరిస్తున్నారు. దీంతో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు కొంచెం తెలుగుదేశం పార్టీతో కలుస్తూ ఉన్నట్టుగా అనుమానాలకు తావిస్తోంది. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ కంటే ఎక్కువగా బీజేపీ ఇటీవల జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేయటం విషయంలో చాలా యాక్టివ్ అయ్యింది. అయినా గాని వైయస్ జగన్ అవేమీ పట్టించుకోకుండా కేవలం ప్రజా సంక్షేమం పై అదేవిధంగా  రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రమే దృష్టి పెట్టడం జరిగింది.

 

మరోపక్క కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ తేడా రాకుండా ఎప్పటికప్పుడు నిధులు తేప్పించుకునే విధంగా… కీలక సమయంలో జగన్ బీజేపీకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో మొదటిలో జగన్ ప్రతిపాదించిన మూడు రాజధానులు, శాసన మండలి రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మొదటిలో సానుకూలంగానే వ్యవహరించినట్లు కనిపించినా ఆ తర్వాత పట్టించుకోనట్లుగా వ్యవహరించింది. ఇదిలా ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీకి జగన్ అవసరం ఎంతగానో ఉంది. పార్లమెంటులో ఇరవై రెండు స్థానాలు ఉండటంతోపాటు రాజ్యసభలో ఇటీవల నాలుగు స్థానాలు గెలవడంతో ఆరు స్థానాలు కలిగి ఉండటంతో కేంద్రానికి సంబంధించి కీలకమైన బిల్లుల విషయంలో జగన్ సహాయం అవసరం ఉంది.

 

అయితే చైనా సరిహద్దు వివాదం విషయంలో చాలా రాష్ట్రాల నుండి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు రావడం జరిగాయి. ఈ విషయంలో వైయస్ జగన్ మాత్రం వీడియో కాన్ఫరెన్స్ లో  మాట్లాడుతూ ఈ సందర్భంలో రాజకీయాలు అనవసరమని ప్రపంచంలో ఇండియాకి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ మోడీ వల్ల వచ్చిందని తాను మోడీ నాయకత్వాన్ని నమ్ముతున్నట్టు తెలుపుతూ చైనా ని ఏవిధంగా దెబ్బ కొట్టాలి అన్న దాని విషయంలో కొన్ని పాయింట్లు కూడా చెప్పడం జరిగింది. కాగా ఇటీవల బీజేపీ పార్టీ పెద్దలు సమావేశమైన సందర్భంగా జగన్ ప్రస్తావన వచ్చిన టైంలో చాలా విషయాల్లో కేంద్ర ప్రభుత్వానికి  అతను సపోర్ట్ చేస్తున్న మనమే అతన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నాం… దీంతో రాబోయే రోజుల్లో అన్ని విధాల ఏపీ రాష్ట్రానికి అండగా నిలవాలని కేంద్ర పెద్దలు డిసైడ్ అయినట్లు...ఆ స్టేట్ పాలిటిక్స్ కి కొద్దిగా దూరంగా ఉండాలని అనుకున్నట్లు ఢిల్లీ రాజకీయాల్లో వినపడుతున్న టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి: