కాపు నేస్తం పేరుతో వైసీపీ ప్రభుత్వం అర్హులైన కాపు మహిళలకు నేరుగా వారి బ్యాంకు ఎకౌంటు లోకి 15 వేల రూపాయలు సొమ్ములు జమ చేసింది. దీంతో ఒక్కసారిగా కాపుల్లో వైసీపీ ప్రభుత్వం పై సానుకూలత పెరిగినట్లుగా పరిస్థితులు మారాయి. ఇప్పటి వరకు ఆ సామాజిక వర్గం మొత్తం జనసేన వైపు ఉన్నట్టుగా జనసేన పార్టీ నాయకులు చెప్పుకుంటూ ఉండేవారు. ఇక ఇప్పుడు వైసిపి నేరుగా వారికి సొమ్ములు ఇవ్వడంతో, ఎక్కడ తమ ఓటు బ్యాంకుకు గండి పడుతుందో అన్న అభిప్రాయంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగిపోయారు. కాపులను బీసీల్లో చేరుస్తామని తాము ఎప్పుడూ చెప్పలేదు అని, ఎన్నికలకు ముందే కాపు రిజర్వేషన్ అంశం నా చేతుల్లో లేదని, నేను ఇస్తానని చెప్పి చంద్రబాబులా మోసం చేయలేనని, కాపుల అడ్డాగా ఉండే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట లో జగన్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు. 

IHG


దీంతో ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో అలజడి రేగింది. ముఖ్యంగా కాపు వైసిపి నాయకులు జగన్ ప్రకటనతో కంగారు పడ్డారు. అసలు ఈ రిజర్వేషన్ అంశాన్ని అనవసరంగా జగన్ తెరమీదకు తెచ్చారని, సైలెంట్ గా ఉంటే సరిపోయేది అనుకున్నారు. కానీ జగన్ వెనక్కి తగ్గలేదు. పైగా తన వ్యాఖ్యలకు క్లారిటీ కూడా ఇచ్చారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఇవ్వాలంటే, పార్లమెంట్ ఉభయసభలు దానిపై నిర్ణయం తీసుకోవాలని, నా చేతుల్లో ఏమీ లేదని, జగన్ చేతులెత్తేసారు. కానీ పవన్ ను ఆరాధించే కాపు సామాజిక వర్గం మాత్రం పవన్ ప్రకటనపై చాలా ఆశగా ఎదురు చూశారు.

 


 కానీ ఈ విషయంలో పెద్దగా స్పందించలేదు. ఎన్నికలకు ముందు తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ అంశంపై స్పందించాల్సి రావడంతో బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ క్లారిటీ ఇచ్చాడు.  ఇక ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం నేరుగా అర్హులైన కాపు మహిళల అకౌంట్ లో 15000 నేరుగా  వేయడంతో జనసేన కు చెందినవారు ఎక్కడ వైసీపీకి దగ్గరవుతారో అనే భయంతో పవన్ వేగంగా స్పందించారు. అసలు కాపు రిజర్వేషన్ల అంశంపై పవన్ స్పందించాలి అన్నదే వైసిపి అసలు గేమ్ గా తెలుస్తోంది. 


పవన్ కాపులకు ప్రతినిధిగా చూపించి మిగతా వర్గాలకు దూరం చేయాలని వైసిపి ఎత్తుగడ ఇప్పుడు నెరవేరుతున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి కనుక ఈ రిజర్వేషన్ల అంశంపై కేంద్రం పై ఒత్తిడి పెంచే బాధిత పవన్ పై  ఉందని వైసీపీ రివర్స్ ఎటాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: