సంగీతం.. మంచి సంగీతం వింటే మనల్ని మనమే మర్చిపోతాం. సంగీతానికి అంత శక్తి ఉంది. ఈ సంగీతం వినడానికి చిన్న పెద్ద అనే తేడా ఉండదు. ఎవరైనా సంగీతాన్ని ఆస్వాదించచ్చు. ఇంకా సంగీత ప్రియులకు మంచి సంగీతం వినిపిస్తే లోకాన్ని మర్చిపోయి ఆస్వాదించేస్తారు. మరికొందరు సంగీతం విని తెలియకుండానే కాలు కదిపేస్తారు. 

 

మంచి సంగీతం వింటే మనిషికి ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుందని ఎంతోమంది ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. మనకు ఆ సంగీతం నచ్చింది అంటే బాషా అవసరం లేదు.. నచ్చిన సంగీతాన్ని ఆస్వాదిస్తుంటాం. ఇంకా మనం ఈ మధ్యకాలంలో పిల్లలు కూడా సంగీతాన్ని ఆస్వాదించడం మనం చూస్తూనే ఉన్నాం. 

 

అయితే వారు సంగీతాన్ని వింటారు.. ఆ పాటలను మారిస్తే ఏడుస్తారు కానీ.. వారి ముఖంలో ఆస్వాదించడం మనం ఇంతవరకు చూడలేదు. అయితే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే మురిసిపోతారు.. అలా ఉంది ఆ వీడియో. 

 

ఆ వీడియోలో చిన్నారి సంగీతానికి మైమరచిపోయి ఆస్వాదిస్తోంది. మీరు చేసేది ఏదైనా ప్రేమించాలని లేదంటే అసలు చేయకూడదని సుశాంత నంద ఈ వీడియో పోస్ట్ చేస్తూ క్యాప్షన్ లో పేర్కొన్నారు. ఇంకా ఆ చిన్నారిని చూస్తే మీకు కూడా నిజమే  అని అనిపిస్తుంది. అలా ఉంది వీడియో. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: