కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలతో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే మరో సంఘటన ఇది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా జీవితంలో ఎంత చిత్రవథ అనుభవించాల్సి వస్తుందో చెప్పే మరో సంఘటన. అమ్మాయిల తల్లిదండ్రులు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో వివరించే దారుణ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

 

 

గుంటూరుకు చెందిన ఓ కాలేజీ అమ్మాయిని వరుణ్‌ అనే స్టూడెంట్ పరిచయమయ్యాడు. ఫ్రెండ్షిప్ పేరుతో రూముకు పిలిచాడు. కూల్ డ్రింకులో మత్తు మందు ఇచ్చి అమ్మాయిని నగ్నంగా వీడియో తీశాడు. ఇక అక్కడ నుంచి ఆ అమ్మాయికి నరకం మొదలైంది. ఆ వీడియోను అడ్డుపెట్టుకుని బెదిరిస్తూ వచ్చాడు వరుణ్. అంతే కాదు.. ఆ వీడియోను ఇంటర్‌నెట్లో పెట్టేశాడు.

 

 

ఆ తర్వాత అదే అమ్మాయికి పరిచయమైన మరో అబ్బాయి కౌశిక్.. ఆమెను ప్రేమిస్తున్నా అన్నాడు. పెళ్లి చేసుకుంటా అన్నాడు. అయితే అతడి కుటుంబ సభ్యులు ఆ అమ్మాయి కాలేజీకి వెళ్లి ఎంక్వయిరీ చేశారు. వరుణ్ సంగతి తెలుసుకుని అతడి వద్ద నున్న వీడియోలు చూసి ఆ సంబంధం వదిలేసుకున్నారు.

 

 

అయితే కౌశిక్ కు కూడా దుర్భుద్ధి పుట్టింది. ఆ వీడియోలను అతడు కూడా ఇంటర్ నెట్లో పెట్టేశాడు. ఇలా ఇద్దరు అబ్బాయిల నుంచి మూడేళ్లుగా నరకం అనుభవించిన ఆ అమ్మాయి ఎట్టకేలకు ఇక లాభం లేదనుకుని పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు ఆ ఇద్దరు అబ్బాయిలను అదుపులోకి తీసుకుని ఆ వీడియోలు స్వాధీనం చేసుకుని.. ఇంటర్ నెట్ నుంచి కూడా వీడియోలు తీయించేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: