ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ గురించి రోజుకో వార్త వెలుగులోకి వ‌స్తోంది. ఇది ముందుగా చైనాలో పుట్టింద‌ని చాలా మంది చెపుతున్నా ఇప్ప‌ట‌కి స‌రైన క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే క‌రోనా గురించి మ‌రో స‌రికొత్త న్యూస్ వెలుగు లోకి వ‌చ్చింది. కరోనా వైరస్‌ను మొద‌టిసారిగా స్పెయిన్‌లో గుర్తించార‌ని, చైనాలోని ఉహాన్‌లో కాద‌ని బార్సిలోనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము జ‌రిపిన ఒక అధ్యయనంలో ఈ విష‌యం వెల్ల‌డ‌య్యింద‌ని అన్నారు.‌ 2019, మార్చి 12న స్పెయిన్‌లోని ఒక నగరంలో ల‌భ్య‌మైన‌ మురుగునీటిలో ఈ వైరస్ క‌నుగొన్నామ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు చెపుతోన్న విష‌యంతో క‌రోనా విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు చైనా వైపు చూసిన అంద‌రి చూపులు ఇప్పుడు స్పెయిన్ వైపు మ‌ర‌లుతున్నాయి.

 

అయితే ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న ఈ అత్యంత ప్ర‌మాద‌క‌ర వైర‌స్ గురించి తొలిసారిగా చైనా 2019 డిసెంబర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. కాగా స్పెయిన్ శాస్త్ర‌వేత్త‌లు ఈ అధ్యయనం కోసం అక్క‌డి వివిధ నగరాల నుంచి మురుగునీటి నమూనాలను జనవరి 2018 నుండి డిసెంబర్ 2019 మధ్య వేర్వేరు తేదీలలో సేక‌రించారు. ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా వైర‌స్‌ను అనేక కోణాల్లో విశ్లేషించారు. ఈ ప‌రీక్ష‌ల‌లో క‌రోనా వైర‌స్‌కు సంబంధించి ఓ జ‌న్యు ప‌దార్థం గుర్తించార‌ని స‌మాచారం. అయితే ఇందులో వైర‌స్ చాలా  త‌క్కువ స్థాయిలో ఉంద‌ని స‌మాచారం.

 

ఇక వీరు చెపుతోన్న దాని ప్ర‌కారం ఈ వైర‌స్ ను 2019, మార్చి 12న సేక‌రించారు. అయితే ఈ పరిశోధనపై ఇంకా స‌మీక్ష జ‌ర‌గ‌లేద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. అయితే దీనిని పూర్తిగా న‌మ్మ‌లేం అని.. అక్క‌డ మ‌రిన్ని న‌మూనాలు తీసుకుని.. మ‌రిన్ని ప‌రీక్ష‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: