ఏపీ సీఎం జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలు గాని, సంక్షేమ పథకాలు, నిర్ణయాలు అన్ని దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. జగన్ అమలు చేస్తున్న చాలా కార్యక్రమాలను ఇప్పటికే ఇతర రాష్ట్రాలు అనుసరించడమే కాకుండా, వాటిని తమ రాష్ట్రాల్లో అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా జగన్ పేరు ఈ విధంగా మారుమోగుతూ వస్తోంది. అలాగే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం వంటివి ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ను బాగా ఆకర్షించాయి. అదేవిధంగా జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల పైన సమీక్ష చేపట్టారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసేలా అధికారులకు సూచనలు ఇవ్వడంతో, ఏడాది కాలంలో అధికారులు సమన్వయంతో ఎక్కడ తక్కువ ధరకు విద్యుత్ దొరుకుతుందో అక్కడే కొనుగోలు ఒప్పందాలను చేసుకుంటూ వస్తుండడంతో, ఏపీ ఖజానాకు గండి పడకుండా చూడగలిగారు. 

 

IHG's guidelines: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='andhra pradesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>andhra pradesh</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CM' target='_blank' title='cm-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>cm</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=YS JAGAN MOHAN REDDY' target='_blank' title='jagan-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jagan</a> - The New ...


దీనివల్ల ఏడాది కాలంలోనే విద్యుత్ కొనుగోళ్లలో 700 కోట్లు ఏపీ ప్రభుత్వం ఆదాయ చేసింది. ఈ విషయము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను బాగా ఆకర్షించింది. తాజాగా జరిగిన ఏపీ ట్రాన్స్కో బోర్డు సమావేశంలో ఈ ఏడాది కూడా మరిన్ని పొదుపు చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పొదుపు చర్యలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆ బోర్డు సమావేశంలో ఆ శాఖ కార్యదర్శి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. చౌక విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల పై తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఆసక్తిగా ఉన్నాయని, అదే సమావేశంలో శాఖ ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ చెప్పుకొచ్చారు. 

 


మన రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను తెలుసుకునేందుకు ఆయా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ అధికారులతో సంప్రదింపులు చేస్తున్నాయనే విషయాన్ని కూడా వెల్లడించారు. ఏపీ ముందస్తు ప్రణాళిక రూపొందించడంతో పాటు, సీఎం జగన్ ఇచ్చిన మద్దతు కారణంగా యూనిట్ విద్యుత్ 1.63 నుంచి 2.80 మధ్యనే కొనుగోలు చేయగలిగామని బోర్డు మీటింగు అభిప్రాయపడింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: