వైసీపీ పార్టీ లో రెబెల్ ఎంపీగా రోజు రోజుకీ వార్తల్లో హాట్ టాపిక్ గా ఉంటున్న రఘురామకృష్ణంరాజు త్వరలో వైఎస్ జగన్ తో భేటీ అవటానికి అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఓ వర్గం మీడియా కి ఇంటర్వ్యూ లు పదే పదే ఇస్తూ ప్రభుత్వంపై సొంత పార్టీ ప్రజాప్రతినిధులపై అవినీతి ఆరోపణలు చేయటంతో జగన్ పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు కూడా పంపించడం జరిగింది. అయితే షోకాజ్ నోటీసులు విషయంలో congress PARTY' target='_blank' title='ysrcp-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ysrcp పార్టీ పేరు ప్రస్తావన విషయంలో కొన్ని అవాంతరాలు చోటుచేసుకున్నట్లు వాటిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి రఘురామకృష్ణంరాజు తీసుకెళ్లా బోతున్నట్లు ఫిర్యాదు కూడా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

IHG's ire for ...

ఇదే రీతిలో రఘురామ కృష్ణం రాజు ఇటీవల ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని అలాగే లోక్ సభ స్పీకర్ ని రఘురామకృష్ణంరాజు కలవడం జరిగింది. మరి ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలీదుగానీ… తాజాగా రఘురామ కృష్ణంరాజు కి వైయస్ జగన్ నుండి పిలుపు వచ్చినట్లు ఆయనతో త్వరలో రాజుగారు సమావేశం కానున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు జోరందుకున్నాయి.

IHG

దీంతో మొన్నటి వరకు మీడియా సమావేశాలలో ఒక్కసారి జగన్ తో కూర్చుంటే.. జగన్ అపాయింట్మెంట్ దొరికితే సమస్యలన్నిటికీ పుల్ స్టాప్ పడతాయని.. తెలిపిన రఘురామకృష్ణంరాజు కి తాజాగా జగన్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సమావేశం తర్వాత ఈసారైనా రఘురామకృష్ణంరాజు పొలిటికల్ దూకుడు వైసీపీ పార్టీలో తగ్గుతుందో లేదో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: