సోష‌ల్ మీడియా.. దీని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దేశం టెక్నాలజీ వైపు అడుగులు వేస్తోంది. స్మార్ట్ ఫోన్ల విప్లవంతో యువత అరచేతిలోనే ప్రపంచాన్ని చూస్తోంది. తగ్గిన ఇంటర్నెట్ ఛార్జీల పుణ్యమా అని ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని తెగ వాడేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే  ప్రపంచంలో ఏం జరుగుతోందో సోషల్ మీడియా ద్వారా చిటికెలో తెలుసుకుంటున్నాయి. అలాగే సినీ సెల‌బ్రెటీలు లేదా రాజ‌కీయ నాయ‌కుల్లో ఎవ‌రైనా నోరు జారినా.. మాట మార్చినా నెటిజ‌న్లు ఇదే సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకిపారేస్తారు. ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. 

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. న‌రేంద్ర మోడీ 2001-14 కాలంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగిన విష‌యం తెలిసిందే. రాష్ట్రాన్ని ప్రగతిపథంలోకి నడిపిస్తూ దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారు. ఇక 2014 సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్డీఏను విజయపథంలో నడిపించి పూర్తి మెజారిటీ సాధించిపెట్టి 2014 మే 26న ప్రధానమంత్రి పీఠంపై అధిష్టించారు. 2019 ఎన్నికలలో మరల గెలిచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. మోడీ 2012 జూన్ 27న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

 

నాడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది. అయితే ఆ స‌మ‌యంలో న‌రేంద్ర మోడీ  కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తూ.. ఓ హాట్ పోస్ట్ పెట్టారు. అందులో మోడీ మాట్లాడుతూ.. దేశంలో పెట్రోల్ రేట్లను పెంచుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు కొల్లగొడుతోందని.. ఇది ప్రజలపై పెను భారాన్ని మిగులుస్తోందని.. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందానికి పెట్రో ధరల పెంపే నిదర్శనమని.. మోడీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. మ‌రి ఇప్పుడు దేశంలో పెట్రోల్ ధరలు ఏ రేంజ్‌లో భగ్గుమంటున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. దీంతో నాడు మోడీ పెట్టిన పాత పోస్ట్‌ను బ‌య‌ట‌కు తీసి.. నెటిజ‌న్లు ఆయ‌న్ను ఏకిపారేస్తున్నారు. నాడు సీఎంగా నినదించిన మోడీజీ ఇప్పుడు ఎందుకు పెట్రో ధరలు పెంచుతున్నారని ప్ర‌శ్నిస్తున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: