ఆంధ్ర ప్రదేశ్ నూత‌న సీఎంగా అధికారాన్ని చేపట్టినప్పటి నుండి ప్రజా సమస్యల ప‌రిష్క‌రిస్తూ.. ప్ర‌జ‌ల‌కు అండంగా ఉంటూ వ‌స్తున్నారు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. మ‌రోవైపు సంక్షేమ ప‌థ‌కాల్లోనూ ఏ మాత్రం వెనుక‌డుగు వేయ‌కుండా దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్రంలో క్రేజ్ కా బాప్ అయిపోతున్నారు జగన్. ఈ క్రేజ్‌నే బీజీపీ ఉప‌యోగించుకోవాల‌నుకుంటుంది. వాస్త‌వానికి బీజేపీకి జగన్ అవసరం ఉంది. అలాగే జగన్ కి కూడా బీజేపీ అవసరం ఉంది అన‌డంలో సందేహం లేదు.

 

అయితే ముఖ్యంగా జగన్ తో బీజేపీ స్నేహానికి చాలా రీజ‌న్స్ ఉన్నాయ‌ని అంటున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో వైసీపీ చాలా స్ట్రోంగ్‌గా ఉంది. అదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు పెద్ద ఎత్తున ప్రజాదరణ కూడా ఉంది. ఇలా చూసుకుంటే..  2024 ఎన్నిక‌ల్లోనూ జ‌గ‌న్ నే అధికారంలోకి వాస్తార‌ని చాలా మంది భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్‌తో చెలిమిని మ‌రింత స్ట్రోంగ్ చేసుకుంటోంది బీజేపీ. ఎందుకంటే.. 2024 నాటికి బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ రాదు అన్న సంకేతాలు ఇప్ప‌టికే ఉన్నాయి. మ‌రోవైపు కాంగ్రెస్ ఈ నాలుగేళ్ళలో పుంజుకుని వంద సీట్ల మార్క్ దాటుతుంద‌ని రాజ‌కీయ విశ్లేషాకులు భావిస్తున్నారు.

 

అలాగే దేశంలో చాలా చోట్ల ప్రాంతీయ పార్టీలకు కొత్త బలం వస్తుందని అంటున్నారు. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో మూడవసారి కూడా బీజేపీ కేంద్రంలో అధికారం చేప‌ట్టాలంటే ఖ‌చ్చితంగా జ‌గ‌న్ అవ‌స‌రం ఉంది. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.. 2024 నాటికి జగన్ కి మరీ 22 ఎంపీ సీట్లు రాకపోయినా.. దాదాపు 15 ఎంపీ సీట్లకు తగ్గవని అంటున్నారు. అయితే జగన్ ఖ‌చ్చితంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు మద్దతు ఇవ్వరని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ఆ బలం కాస్త బీజేపీకి తోడు అయితే.. ముచ్చ‌ట‌గా మూడో సారి కూడా బీజేపీనే అధికారంలోకి వ‌స్తుంది. అందుకే జగన్ తో బీజేపీ కేంద్ర పెద్దలు స్నేహంగా ఉంటున్నార‌ని అంటున్నారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: