సూర్యుడి పదేళ్ల జీవితకాలానికి సంబంధించిన అద్భుత వీడియోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా విడుదల చేసింది. 2010-2020 మధ్య సూర్యుడి పూర్తిగమనాన్ని గంట నిడివితో అందించింది. 

 

నాసాకు చెందిన సోలార్‌ డైనమిక్స్‌ అబ్జర్వేటరీ  సూర్యుడిని దశాబ్దకాలంగా పరిశీలిస్తోంది. భూమి చుట్టూ పరిభ్రమిస్తూనే అత్యుత్తమ నాణ్యతతో 425 మిలియన్ల‌ సూర్యుడి చిత్రాలను సేకరించింది. వాటన్నిటినీ ఏకం చేసి గంట నిడివి వీడియోను ఆవిష్కరించింది. 

 

మనకు అత్యంత సమీపంలో ఉన్న నక్షత్రం సూర్యుడే. సౌర వ్యవస్థపై ఆ తార ప్రభావాన్ని శాస్త్రవేత్తలు అర్థం చేసుకొనేందుకు ఈ 11 ఏళ్ల సౌరచక్రం సాయపడనుంది. నాసా ప్రకారం సూర్యుడి అయస్కాంత క్షేత్రం ఒక భ్రమణం పూర్తి చేస్తే దానిని సౌర చక్రంగా పరిగణిస్తారు. ప్రతి 11 ఏళ్లకు సూర్యుడి అయస్కాంత క్షేత్రం పూర్తిగా తలకిందులవుతుంది. ఉత్తర, దక్షిణ ధ్రువాలు స్థానాలు మార్చుకుంటాయి. సువర్ణ వర్ణంలో ధగధగా మెరిసిపోతున్న సూర్యుడి ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. 

 

ఆకాశంలో అద్బుతాల గురించి తెలుసుకోవాలనే ఉత్కంఠ ప్రజలకు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. అసలు గ్రహాలు, ఉపగ్రహాలు ఎలా ఉంటాయి.. వాటి మీద జీవనం సాగించవచ్చా.. అనే డౌట్స్ చాలా మందిలో ఉంటాయి. ఆ గ్రహంపై వాళ్లు వెళ్లారు వీళ్లు వెళ్లారు అనే సంగతి టీవీల్లో తెలుసుకోవాడమే తప్ప.. నిజజీవితంలో అనుభవించి లేదు. అయితే అంతరిక్ష పరిశోధన సంస్థలు ప్రజల్లో నెలకొన్న అనుమానాలను నివృత్తిచేసే పనిలో నిమగ్నమై ఉంటాయి. ఎప్పుడు అంతరిక్షంపై పరిశోధనలు చేస్తూ కొత్త విషయాలను కనుక్కొంటూ ఉంటాయి. తాజాగా సూర్యుడి పదేళ్ల జీవితకాలానికి సంబంధించిన విషయాలను సేకరించింది. నాసా విడుదల చేసిన గంట నిడివి గల వీడిలో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. 

మనకు అతి దగ్గరలో ఉన్న సూర్యుడిని చూడాలని ప్రయత్నించినా చూడలేదు. ఎందుకంటే ఆ ప్రకాశానికి కళ్లుబయర్లు కమ్ముతాయి. అలాంటిది కళ్లారా చూసే ఛాన్స్ ఇచ్చింది నాసా. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: