తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కరోనా వైరస్ ముప్పు తిప్పలు పెడుతుంది. మొదటిలో చాలా సిల్లీగా కేసిఆర్ తీసుకోవడంతో ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని విపక్షాలు మండిపడుతున్నాయి. వైరస్ వచ్చిన సమయంలో లాక్ డౌన్ టైమ్ లో వరుస మీడియా సమావేశాలు నిర్వహించి ఇంకేముంది కరోనా వైరస్ ని తెలంగాణ జయించింది అన్నట్టుగా వ్యవహరిస్తూ అతిగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. కానీ ప్రస్తుతం బయటపడుతున్న కొత్త కేసులు పరిస్థితి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రం వల్లకాడుగా మారే అవకాశం ఉంది అని చాలా మంది అంటున్నారు.

 

ముందు నుండి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లే వైరస్ వ్యాప్తి తెలంగాణలో పెరిగి పోయిందని...కమ్యూనిటీ స్థాయిలో వైరస్ వ్యాప్తి లేదు అని చెబుతున్న కానీ కమ్యూనిటీ స్థాయిలో ఎప్పుడో వైరస్ వ్యాప్తి చెందిందని ఆ విషయం కేసీఆర్ ప్రభుత్వం బయట పెట్టడం లేదని మేధావులు అంటున్నారు. న్యాయస్థానాలు కేంద్ర ప్రభుత్వం ఎన్ని సార్లు చెప్పిన కేసీఆర్ సర్కార్ నిర్ధారణ పరీక్షలలో నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ పరిస్థితి తెలంగాణాలో ఏర్పడింది అని అంటున్నారు. 

 

ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసులు ఉన్న కొద్ది బయట పడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా ఆయువుపట్టు అయినా హైదరాబాద్ నగరంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ మళ్లీ విధించాలని కేసీఆర్ ప్రస్తుతం నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి సంబంధించి మూడు నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు, విధి విధానాలు తెలియజేయాలి కేసిఆర్ ఆలోచన చేస్తున్నారు. జిహెచ్ఎంసి పరిధిలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకూడదని… ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉందని… హైదరాబాదు ప్రాంతంలో పూర్తిస్థాయిలో కొన్ని రోజులు కఠినంగా లాక్ డౌన్  అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: