విజయసాయిరెడ్డి ఇపుడు బాగా టార్గెట్ అవుతున్నారు. ఆయనకు వైసీపీలో ఎన్నో పదవులు ఉన్నాయని అంటున్నారు. ఆయన జగన్ తో గంటలకు గంటలు గడుపుతారు అంటున్నారు. ఆయన వల్లనే పార్టీకి ఇబ్బందులు వస్తున్నాయని విమర్శలు చేస్తున్నారు. నిజానికి జగన్నే సీఎంగా ఇంకా అంగీకరించే స్థితి వైసీపీలోని కొంతమంది సీనియర్లమని చెప్పుకునే నాయకులకు లేకపోవడానికి కారణం వారి అహంకారమే. అలాంటి వారి కళ్లకు విజయసాయిరెడ్డి ఇలా వెలిగిపోవడం అసలు గిట్టడంలేదులా ఉంది.

 


ఇక టీడీపీ అయితే జగన్ని ఎపుడూ సీఎం అని కాదు కదా పేరు కూడా పెట్టి పిలవదు, ఏ వన్, ఏ టూ అంటూ జగన్ విజయసాయిరెడ్డిలకు ముద్దు పేర్లు పెట్టేసింది. మరి అధికార పార్టీ అన్న తరువాత లుకలుకలు సహజం. దాన్ని క్యాష్ చేసుకుని అయినా వైసీపీని బదనాం చేయాలని టీడీపీ తెర వెనక గేం బాగానే ఆడుతోందని అంటున్నారు.

 

ఈ మొత్తం గేంలో డైరెక్ట్ టార్గెట్ ఇపుడు విజయసాయిరెడ్డి అయిపోయారు. ఆయన జగన్ కి బాగా సన్నిహితుడు. ఆయన్ని కనుక పక్కన పెడితే జగన్ వీక్ అవుతారని, అపుడు వైసీపీ రాజకీయంగా ఇబ్బందుల్లో పడుతుందని విపక్షం ఆడుతున్న రాజకీయానికి వైసీపీ నుంచి కూడా కొందరు అసంత్రుప్తుల నుంచి మద్దతు లభించడంతో ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

 

పార్టీ అధికారంలోకి వచ్చి గట్టిగా ఏడాది కూడా కాలేదు కానీ పార్టీలో ఉన్న ఓ ఎంపీ గారికి ఉక్కబోత ఎందుకో అర్ధం కాదు, ఆయన విజయసాయిరెడ్డినే టార్గెట్ చేస్తాడు. ఆయనకు ఎన్నో పదవులు అంటాడు. కానీ ఆయనకు తెలియనిది మరోటి ఉంది. అదేంటి అంటే విజయసాయిరెడ్డికి ఈ పదవులు కంటే కూడా వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. అది ఇంకా గొప్పది.

 

ఇక మరో మాజీ మంత్రి పెద్దాయన కూడా తెగ బాధపడిపోతున్నాడు. పార్టీ గురించి, సర్కార్ మీద‌  నెగిటివ్ గా గ‌ట్టిగా మాట్లాడుతున్నాడు. వీరంతా తలో చేయీ వేసి వైసీపీని వీక్ చేయడానికి విజయసాయిరెడ్డి మీద బాణాలు వేస్తున్నారు. నిజానికి విజయసాయిరెడ్డికి జగన్ కి ఉన్న బంధం తెగదని అంటారు దగ్గరగా చూసిన వారు. పైగా జగన్ పార్టీ మొత్తానికి నమ్మేది సాయిరెడ్డినే అంటారు. మరి చూడాలి ఈ రాజకీయ చదరంగంలో  సాయిరెడ్డి ఎలా బయటపడతారో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: