దేశంలో ప్రమాదకర స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. జూన్ 8కు ముందు పదుల సంఖ్యలో నమోదైన కేసులు ప్రస్తుతం వందల్లో నమోదవుతున్నాయి. దేశంలో ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎవరూ అంచనా వేయలేదు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు కరోనా పేరు వింటేనే గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. పట్టణాల నుంచి కరోనా వైరస్ పల్లెలకు సైతం పాకుతోంది. 
 
కరోనా వైరస్ విజృంభణ వల్ల మార్కెట్లో వైరస్ సోకకుండా ఉండటం కోసం కొత్త కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. కరోనా విజృంభణ వల్ల గతంలో డాక్టర్లు మాత్రమే వినియోగించే మాస్కులు ప్రస్తుతం ప్రతి ఒక్కరూ వినియోగించాల్సిన పరిస్థితి నెలకొంది. వైరస్ ను చంపే కెమికల్ పూసిన మాస్కులు సైతం అందుబాటులోకి వస్తున్నాయి. కొంతమంది వైరస్ నుంచి రక్షణ కోసం ఫేస్ షీల్డ్ లు ఉపయోగిస్తున్నారు. 
 
అయితే ముక్కులకు మాస్కులు ధరించడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు వస్తున్నాయని పలువురు చెబుతున్నారు. హై క్వాలిటీ మాస్కులు ఉపయోగించే వారికి ఎటువంటి ప్రమాదం లేదు కానీ సాధారణ మాస్కులు వాడేవారు జాగ్రత్తగా ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు లక్షణాలు కనిపించని వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతోంది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రోగులను హోం క్వారంటైన్ లో ఉండాలని సూచిస్తున్నాయి. అయితే హోం క్వారంటైన్ లో ఉన్న రోగులు అకస్మాత్తుగా చనిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
దీంతో ఢిల్లీ సర్కార్ కరోనా రోగులకు ఆక్సీ మీటర్లను పంపిణీ చేస్తోంది. కరోనా రోగులు ఆక్సీ మీటర్లలో ఎప్పుడైనా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆక్సీ మీటర్ల ఉపయోగం దేశవ్యాప్తంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆక్సిజన్ లెవెల్స్ 90 - 85 శాతం మధ్య ఉంటే ప్రమాదకరమని... ఈ స్థాయి మరింత తగ్గితే మరీ ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. 85 శాతం కంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే వెంటిలేటర్లు అవసరం అని వైద్యులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: