కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో మొన్నటివరకు దేవినేని ఉమా పెత్తనం చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓడిపోయాక జిల్లాలో ఉమా పెత్తనం సాగడం లేదు. ఆయన్ని ఏ నేత కూడా పట్టించుకోవడం లేదు. ప్రస్తుతానికి టీడీపీలో కేశినేని నాని, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బుద్దా వెంకన్న లాంటి వారి హవా ఎక్కువగా ఉంది. అయితే అదే కృష్ణా వైసీపీలో ఎక్కువ హవా ఎక్కువ ఎవరిది అంటే మంత్రి కొడాలి నానిదే అని చెప్పొచ్చు.

 

అయితే కొడాలి నానితో పాటు మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, సీనియర్ నేతలు పార్థసారథి, సామినేని ఉదయభాను, మేకా వెంకట ప్రతాప్ అప్పారావుల హవా కూడా బాగానే ఉంది. కానీ కొడాలి నానితో పోలిస్తే మిగిలిన వారి క్రేజ్ చాలా తక్కువే అని చెప్పాలి. కొడాలికి రాష్ట్ర స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. జగన్‌కు అత్యంత సన్నిహితమైన నేత. జగన్‌ దగ్గర తనకు కావాల్సిన పనులు చేయించుకునే చనువు కొడాలికి ఉంది. ముఖ్యంగా చంద్రబాబుపై వంటికాలి మీద వెళ్ళే నాయకుడు. అలాగే జిల్లా రాజకీయాలపై పూర్తి పట్టు ఉంది.

 

అయితే కొడాలి ఈ రేంజ్‌కు ఎదగడానికి కారణం దేవినేని ఉమా అని మొహమాటం లేకుండా చెప్పొచ్చు. కొడాలి నాని టీడీపీలో ఉన్నప్పుడు ఉమా జిల్లా రాజకీయాలపై పెత్తనం చేసేవారు. బాబు దగ్గర ఉమా మాట చెల్లుబాటు కావడంతో, ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. ఇక ఈ పెత్తనం భరించలేకే కొడాలి టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చేసారు.

 

అయితే వైసీపీలోకి వెళ్ళాక కొడాలికి చెక్ పెట్టాలని బాబు, ఉమాలు బాగానే ప్రయత్నాలు చేశారు. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు కొడాలి నాని మంత్రి అయ్యి టీడీపీకి చుక్కలు చూపిస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లా రాజకీయాలని మలుపు తిప్పుతూ.. కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాకపోతే ఉమా మాదిరిగా కొడాలి సొంత వాళ్లపై పెత్తనం చేయడం లేదు. ఎక్కడికక్కడ టీడీపీకి చెక్ పెడుతూ, అందరినీ కలుపుకుని పోతూ, పార్టీని ఇంకా బలోపేతం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: