వైసీపీ అంటే జగన్ పార్టీయేనని అందరికీ తెలుసు. వైఎస్సార్ పేరిత జగన్పార్టీ స్థాపించారని చిన్న పిల్లవాడికి కూడా తెలుసు. అయితే వైసీపీ పార్టీ మనది కాదు, అది మరో పార్టీ అని అదే పార్టీ మీద ఎన్నికల్లో పోర్టీ చేసి నర్సాపురం ఎంపీ అయిన రఘురామ క్రిష్ణం రాజు అంటున్నారు. ఆయన ఏకంగా జగన్ తోనే జగడం పెట్టుకున్నారు. మరి రాజు గారి ఉద్దేశ్యాలు ఏంటో కానీ జగన్ మీద గట్టిగా అటాక్ చేస్తూనే ఉన్నారు.

 

ఆయన తాజాగా తనకు వచ్చిన షోకాజ్ నోటీస్ మీద స్పందిస్తూ యువజన శ్రామిక రైతు పార్టీ మనది. వైఎస్సార్ కాంగ్రెస్ మన పార్టీ కాదు అంటున్నారు. అ పేరు మిద మరో పార్టీ ఉందని చెప్పారు. అంతవరకూ ఆ విషయం కూడా ఎవరికీ తెలియదు. అయితే దీని మీద ఇపుడు ఈసీకి అర్జంటుగా ఒక ఫిర్యాదు వెళ్లిందట. అదేంటి అంటే వైసీపీ తన పేరును వాడేసుకుంటుందని కడపకు చెందిన మహబూబ్ బాషా దీని వ్యవస్థాపకుడు ఈసీ దగ్గరకు వెళ్ళారట.  అన్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆయన 2011లోనే పేరు నమోదు చేయించారుట.

 

ఇపుడు ఆయన ఈ గొడవలో ఒక్కసారిగా బయటకు వచ్చి తన పార్టీని వైసీపీ వాడుకుంటోందని ఫిర్యాదు చేశారంటే దాని వెనక ఎవరు ఉన్నారో మరి. మొత్తానికి ఎన్నికల సంఘం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.  ఇక వైసీపీ గుర్తింపు రద్దు అవుతుందని కూడా వైసీపీ ఎంపీగా రాజుగారు అపుడే అపశకునం పలికేశారు కూడా. మరో వైపు రఘురామ క్రిష్ణంరాజు ఎన్ని మాటలు అంటున్నా వైసీపీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తోంది. సమయం సరైనది చూసి వేటు వేయాలన్నది జగన్ ఆలోచనగా ఉంది అంటున్నారు. మొత్తానికి ఏపీ రాజకీయాల్లో కాక పుడుతోంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: