ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న  విషయం తెలిసిందే. గాల్వన్ లోయ పై కన్నేసిన చైనా ఎలాగైనా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే భారత్ మాత్రం వెనుకడుగు వేయకుండా దీటుగా సమాధానం ఇస్తోంది. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న ఘర్షణలో ఏకంగా భారత సైన్యానికి చెందిన 20 మంది అమరుల అవ్వడం కూడా సంచలనంగా  మారిపోయింది. ఈ నేపథ్యంలో చైనా భారత యుద్ధానికి సంబంధించి గతంలో జరిగిన సంఘటన సంబంధించిన అంశాలు కూడా ప్రస్తుతం తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో వాజ్ పై చైనా కు  సరైన బుద్ధి చేసిన ఘటన గురించి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 

 


 చైనా కుటిల బుద్ధి కి సరైన సమాధానం చెబుతూ అప్పట్లో స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చారు వాజ్పాయ్. 1962 యుద్ధం తర్వాత ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఎంతో గంభీరంగానే ఉన్నా... కానీ చైనా దుందుడుకుగా  వ్యవహరించి 1962 మధ్య ఒక వింత ఆరోపణ పతాక స్థాయికి చేరింది. కొందరు భారత సైనికులు తమ భూభాగంలోకి ప్రవేశించి గొర్రెలు బర్రెలు ఎత్తుకెళ్లారు అంటూ చైనా ఆరోపణలు చేసింది. ఈ సాకుతో నే భారత్తో యుద్ధానికి దిగి  సిక్కిం భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి అప్పట్లో చైనా ప్లాన్ వేసింది. 

 

 ఇక చైనా యుద్ధానికి దిగాలి అనుకుంటున్న సమయంలోనే భారత సైన్యం పాకిస్థాన్లో చొరబాటుదారులతో  యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే అప్పట్లో చైనా భారత కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. భారత దేశానికి చెందిన సైనికులు తమ దేశానికి చెందిన ఎనిమిది వందలు గొర్రెలు బర్రెల దొంగిలించారంటూ లేఖలో పేర్కొంది. ఇలా ఉత్తరాలు ప్రత్యుత్తరాలు చాలానే జరిగాయి. ఈ క్రమంలోనే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పాలని భావించిన ఆ నాటి ఎంపీ వాజ్ పేయి.. 800 గొర్రెలను ఏర్పాటు చేశారు. వాటిపై ప్లకార్డులు ఏర్పాటు చేసి మమ్మల్ని తినండి కానీ ప్రపంచ దేశాలను కాపాడండి.. అని రాసి చైనా రాయబార కార్యాలయంలో కి పంపారు. ఇలా చైనాకి అప్పట్లోనే భారత ఝలక్ ఇచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: