మోడీ ఇపుడు ఆలోచిస్తున్నది పెరుగుతున్న కరోనా వైరస్ తో పాటు చైనా  విరుచుకుపడుతున్న తీరును కూడా. పాకిస్థాన్ కి బుధ్ధి చెప్పిన తీరులో చైనాకు చెప్పడం కష్టం. అది పెద్ద దేశం, రక్షణపరంగా కూడా పటిష్టంగా ఉంది. వారి రక్షణ రంగానికి పెట్టే బడ్జెట్ కూడా మనకు నాలుగైదింతలుగా ఉంటుంది

.

ఇక చైనాకు తెగించిన దేశమని పేరు. పైగా ఎవరినీ లెక్కచేయని తత్వం చైనా సొంతం. అందుకే మోడీ ఒకటికి రెండుమార్లు ఆలోచన చేస్తున్నారు. చైనాకు తగిన గుణపాఠం చెప్పడానికి కూడా రంగం సిధ్ధం చేస్తున్నారు. మన్ కీ బాత్ లో ప్రధాని మాట్లాడుతూ చైనాకు ఇండైరెక్ట్ గా గట్టి  హెచ్చరికలు జారీ చేశారు. చైనా తమాషాలు చూస్తూ ఊరుకోబోమని కూడా వార్నింగు ఇచ్చారు. బలమైన సాహసమైన భారత సైన్యం ఎంతదాకా అయినా వెళ్తారని, ప్రపంచంలో ఎవరినైనా జయించే సత్తా భారతీయ సైనికులకు ఉందని కూడా మోడీ చెప్పుకొచ్చారు.

 

ఓ విధంగా చూస్తే అది నిజమని చెప్పాలి. అనేక సార్లు చైనాతో మనకు వివాదాలు జరిగినా చైనా సైనికులే ఎక్కువగా చనిపోయారు. భారత్ వైపు చూసుకుటే తక్కువ నష్టమే జరిగింది. దొడ్డి దారిన, దొంగ దెబ్బ తీయాలనుకునా కూడా చైనాకు మన సైన్యం చెక్ పెడుతూనే ఉంది.

 

ఇక ఇపుడు గాల్వాల్ లోయ అన్నది మనకు అతి ముఖ్యమైన ప్రాంతం. ఈ విషయంలో చైనాతో ఎట్టి పరిస్థితుల్లోనూ తేల్చుకోవాలని మోడీ పట్టుదల మీద ఉన్నారని ఆయన మాటలను బట్టి అర్ధమవుతోంది. చైనా దిగి రావాలన్నదే భారత్ అజెండాగా ఉంది. ఈ విషయంలో ఏం చేయాలో అదే చేస్తామని కేంద్రం పెద్దలు అంటున్నారు. దౌత్య పరంగానే కాదు, అన్ని విధాలుగా చైనాను దారికి తెచ్చేందుకు ముకుతాడు వేసేందుకు కూడా తాము రెడీగా ఉన్నాయమని అంటున్నారు.మొత్తానికి చైనా విషయంలో మోడీ స్ట్రాటజీ కరెక్ట్ గానే ఉందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: