కరోనా గురించి ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చేసింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ అవగాహన మరింత ఎక్కువగా ఉంది. బయట ఎవరూ మాస్క్ లేకుండా కనిపించడం లేదు. సామాజిక దూరం కూడా పాటిస్తున్నారు. అయితే.. హైదరాబాద్ లో కరోనా కొత్త లక్షణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.

 

 

ఆ కొత్త లక్షణాలు ఏంటంటే.. కరోనా సోకినా ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండటం.. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీలో 180 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ఈ విషయం అకాడమీ డైరెక్టర్ వికె సింగ్ చెప్పారు. అయితే వీరిలో ఎక్కువ మందికి కరోనా లక్షణాలే లేవట. అయినా కూడా పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఇలాంటి లక్షణాలతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

 

 

ఈ లక్షణాలతో కరోనా వచ్చినా వారు సాధారణంగానే ఉంటారు.. కాబట్టి సమాజంలో బాగా తిరగగలుగుతారు. వీరి వల్ల కరోనా మరింతగా వ్యాపిస్తుందన్నమాట. తెలంగాణ పోలీస్ అకాడమీలో కరోనా వచ్చినవారిలో వంద మంది శిక్షణ ఎస్..లు ఉన్నారు. మరో ఎనభై మంది అక్కడి సిబ్బంది. వైరస్ వచ్చినవారందరికి అకాడమీలోనే ఐసోలేషన్ ను ఏర్పాటు చేశారు.

 

 

అందుకే కరోనా పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. బయటకు వెళ్తే అన్ని జాగ్రత్తలు పాటించండి. మీ పక్కన ఉన్న వ్యక్తి మామూలుగానే ఉన్నాడు కదా అని లైట్ గా తీసుకోకండి. ఏమో అతనికి ఇప్పటికే కరోనా వచ్చి ఉండొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: