చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన సంగతి తెలిసిందే. వైరస్ వ్యాప్తి వల్ల ప్రపంచ దేశాలకు చైనాపై వ్యతిరేకత పెరిగింది. పలు దేశాలు చైనాపై విమర్శలు చేశాయి. మరికొన్ని దేశాలు చైనాలో ఉన్న తమ దేశపు కంపెనీలకు అక్కడినుంచి వచ్చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. చైనా భారత్ వివాదం సమయంలో కూడా ప్రపంచ దేశాలు భారత్ కే తమ మద్దతు ప్రకటిస్తున్నాయి. 
 
భారత్ చైనాతో ఇప్పటికే పలు ప్రాజెక్టులను రద్దు చేసుకోగా మరికొన్ని ప్రాజెక్టులను రద్దు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. భారత్ చైనా వస్తువుల బహిష్కరణ, చైనా యాప్ ల నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. అయితే తాజాగా చైనాకు మరో భారీ షాక్ తగిలింది. ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్, మొబైల్ నెట్వర్క్ కు సంబంధించిన కీలక పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం భారత్ 4జీ సర్వీసులను ఎక్కువగా వాడుతున్నాం. 5జీ సేవలు కూడా ప్రపంచానికి అందుబాటులోకి తీసుకురావడానికి చైనా ప్రయత్నిస్తోంది. చాలా నెలల నుంచి డ్రాగన్ దేశం ఈ దిశగా అడుగులు వేస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా వైరస్ వల్ల అమెరికా తమ దేశంలో 5జీ సేవలను నిషేధించింది. జపాన్ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. ఫ్రాన్స్ కూడా చైనా 5జీ సేవలను వినియోగించుకోబోమని ప్రకటన చేసింది. 
 
చైనా మిత్ర దేశాల్లో ఒకటైన సింగపూర్ కూడా వేరే దేశాలు అందించే 5జీ సేవలకే మొగ్గు చూపి చైనాకు షాక్ ఇచ్చింది. చైనా వస్తువులు తక్కువ నాణ్యతతో తయారవుతాయని కీలక ప్రకటన చేసింది. 5జీ సేవల ద్వారా ప్రపంచ దేశాలకు సేవలు అందించి సమాచారాన్ని సేకరించాలని భావించగా చైనా 5జీ టెక్నాలజీనే తమకు వద్దని పలు దేశాలు చైనాకు భారీ షాక్ ఇచ్చాయనే చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: