ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కృష్ణా జిల్లా రాజకీయాల్లో చాలా కీలకమైనవి. చాలా వరకు రాష్ట్ర రాజకీయాలు జిల్లా చుట్టూ తిరుగుతుంటాయి. కృష్ణా జిల్లా నుండి చాలా ప్రముఖమైన రాజకీయ నాయకులు పదవులు అధిరోహించిన వాళ్ళు చరిత్రలో కనబడతారు. అటువంటి కృష్ణాజిల్లాలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ గా ఎప్పటి నుండో రాణిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ వర్సెస్  కాంగ్రెస్ అన్నట్టుగా పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందో ఆంధ్రాలో వైసీపీ పార్టీలో చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు చేరటం జరిగిన కృష్ణా జిల్లా పై పట్టు సాధించలేకపోయారు.

 

అదే సమయంలో కృష్ణా జిల్లా ప్రజలు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తూ ఉన్నారు. అందువల్లే 2019 ఎన్నికలలో కృష్ణాజిల్లాలో విజయవాడ ఎంపీగా కేశినేని నాని గెలవడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో చాల చోట్ల స్థానిక సమస్యలపై చిరాకు వచ్చి ప్రజలు వైసిపి పార్టీ గెలిచిన కృష్ణా జిల్లా ప్రజలు ప్రజంట్ మాత్రం ఎక్కువగా తెలుగుదేశం పార్టీకే మక్కువ చూపుతున్నట్లు  టీడీపీ పార్టీకి చెందిన నేతలే జిల్లా రాజకీయాలలో చక్రం తిప్పుతున్నట్టు వార్తలు వినబడుతున్నాయి. పార్టీ ఓడిపోయిన కానీ ప్రజలు మాత్రం ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకుల చెంతకే ప్రజలు వెళ్తున్నారట. జిల్లాలో గత ఎన్నికలలో గెలిచి మంత్రులు గా వ్యవహరించిన వారి చుట్టూ యే ఇప్పుడు కృష్ణా జిల్లా జనాలు తమ సమస్యలు తీర్చాలని అభ్యర్థన చేస్తున్నారట.

 

ఎప్పటి నుండో కృష్ణాజిల్లాలో ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండటంతోపాటు సీనియర్ నేతలుగా రాణించడంతో కొత్తగా వైసీపీ పార్టీ తరపున గెలిచిన నాయకుల దగ్గర కంటే టీడీపీ నాయకుల దగ్గరికే ప్రజలు వెళ్తున్నారట. జిల్లాలో మంత్రులు కొడాలి నాని, పేర్నినాని, వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్న కృష్ణాజిల్లా ప్రజానీకం మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్లు...అదేవిధంగా వైకాపా ఎదగకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రజెంట్ చాలా అలర్ట్ గా ఉంటూ వైసీపీని చావు దెబ్బ తీయడానికి సరైన ప్లాన్స్ వేస్తున్నట్లు కృష్ణా జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: