తెలంగాణ బిజెపిలో కొత్త హుషారు కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలహీనపడగా, అధికార పార్టీ టిఆర్ఎస్ పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుండడం వంటి కారణాలతో వచ్చే ఎన్నికల నాటికి అధికారం తమకే దక్కుతుందనే ఆలోచనలో తెలంగాణ బిజెపి ఉంది. ఎప్పటి నుంచో తెలంగాణలో బలపడాలని చూస్తున్నా, సరైన అవకాశం రావడం లేదు. కానీ ఈ సారి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో, పార్టీ ని పరుగులు పెట్టించాలని కేంద్ర బీజేపీ పెద్దలు  తెలంగాణ పార్టీ పగ్గాలు ఎంపీ బండి సంజయ్ కు అప్పగించింది. ఆయన బాధ్యతలు స్వీకరించి అప్పుడే వంద రోజులు అవుతోంది. ఆయన తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా నియామక పత్రాలు పొందినప్పటి నుంచి టిఆర్ఎస్ ప్రభుత్వం పై రాజీ లేకుండా పోరాడుతున్నారు. ప్రజా ఉద్యమాలు, ఆందోళనల పేరుతో హడావుడి చేస్తూ బీజేపీకి మైలేజ్ తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తుండడంతో, బిజెపి పెద్దలు కూడా బండి సంజయ్ నాయకత్వంపై బాగా నమ్మకం కుదిరింది. 


ఇక బండి సంజయ్ కూడా తెలంగాణలో టిఆర్ఎస్ కు ధీటుగా బీజేపీని ముందుకు నడిపించాలని చూస్తున్నారు. కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణకు బిజెపి అధ్యక్షుడు మారిన ఇంకా పాత టీమ్ కొనసాగుతుండడంతో, మరికొద్ది రోజుల్లోనే కొత్త టీమ్ ఏర్పాటు చేసే అవకాశం కేంద్ర బీజేపీ పెద్దలు బండి సంజయ్ కు ఇచ్చారు. దీంతో రాష్ట్ర కార్య వర్గం లో ఉన్న అన్ని కమిటీలను రద్దు చేసి కొత్త వారితో నియామకం పూర్తిచేయాలని, బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. ప్రస్తుతం కమిటీలో మొత్తం 28 మంది సభ్యులు ఉండగా, ఈ సంఖ్యను 20 కు  తగ్గించాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారట.


 వీరితో పాటు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శులను, అధికార ప్రతినిధులను కూడా నియమించుకోవాలని చూస్తున్నారు. వీరు కాకుండా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, పార్టీకి అనుబంధంగా ఉండే విభాగాలను కూడా పూర్తిగా మార్చాలని సంజయ్ నిర్ణయించుకున్నాడు. దాదాపు 30 విభాగాలకు సంబంధించి కొత్త వారిని నియమించాలని, వీటితో పాటు, పార్టీ అనుబంధ సంఘాలైన ఎస్సీ మోర్చా, మైనారిటీ మోర్చా, ఓబీసీ మోర్చా, ఎస్టి మోర్చా , మహిళా మోర్చా , కిసాన్ మోర్చా, అన్నిటికీ కొత్త అధ్యక్షులను నియమించాలని చూస్తున్నారు. 


తెలంగాణ బిజెపి లో మొత్తం తన మాట వినేవారినే నియమించుకోవాలని బండి సంజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛ అధిష్టానం ఇవ్వడంతో, ఆయన మొత్తం తనకు అనుకూలంగా ఉన్న వ్యక్తులతోనే ఈ పదవులను భర్తీ చేయాలని చూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: