తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే వుంది. గత కొన్ని రోజుల నుండి రాష్ట్రంలో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడతుండగా ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. ఈఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 983పాజిటివ్ కేసులు వచ్చినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటిలో అత్యధికంగా జిహెచ్ఎంసిలో 813,రంగారెడ్డిలో 47కేసులు బయటపడగా మంచిర్యాలలో ఈరోజు ఏకంగా 33కేసులు నమోదుకావడం గమనార్హం అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 31కేసులు నమోదయ్యాయి.
 
ఇక మొత్తం ఈరోజు 3227శాంపిల్ టెస్టులు చేశారు. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 14419కరోనా కేసులు నమోదవ్వగా అందులో 5172 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 9000కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఈరోజు కరోనాతో 4గురుమరణించడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 247కు చేరింది. మరోవైపు జిహెచ్ఎంసి లో కేసులు భారీగా పెరుగుతుండడంతో మళ్ళీ మరో రెండు వారాలు అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేసే యోచనలో సీఎం కేసీఆర్ వున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. 
 
ఇక దేశ వ్యాప్తంగా కూడా కరోనా జోరు కొనసాగుతూనే వుంది ఈఒక్క రోజే  దేశంలో 19000కు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓవరాల్ గా ఇప్పటివరకు ఇండియాలో 548000కరోనా కేసులు నమోదవ్వగా 16500 మరణాలు చోటుచేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: