మహమ్మారి కరోనా వైరస్ నుండి తప్పించుకోవడం కోసం ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేయడం అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది ఉద్యోగస్తులు మరియు మహిళలు ఇళ్లలోనే ఉండటంతో సమయం ఎక్కువగా దొరకటంతో దాదాపు 70 లక్షల మంది మహిళలు గర్భవతులు అయినట్లు ఐక్యరాజ్యసమితి తాజాగా లెక్కలు బయటపెట్టింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది అని తన తాజా పరిశోధనలో తేలినట్లు చెప్పుకొచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజినీర్లు మరియు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి ఉండటంతో ఇంటి నుండి వర్క్ చేసే పరిస్థితి నెలకొనడంతో లాక్ డౌన్ టైమ్ లో అప్పట్లో కండోమ్ లు బాగా అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి.

 

కానీ ఇప్పుడు టైం ఎక్కువ అవటంతో అవాంఛనీయ గర్భం ధరించిన వారు కూడా ఉన్నట్లు ఈ తాజా పరిశోధనలో తేలింది. అంతేకాకుండా కొంత మంది మహిళలు గృహహింస కింద లైంగిక దాడులకు గురయి గర్భం ధరించిన వారు కూడా ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు రాబోయే రోజుల్లో మహిళల భద్రతకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని, మహిళలు లాక్ డౌన్ టైమ్ లో చాలామంది లైంగిక దాడులకు గురయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.

 

మరో ఆరు నెలలు ప్రపంచం ఈ విధంగా ఉంటే 4.7 కోట్లకు ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని షాకింగ్ వార్త బయటపెట్టింది. అదేవిధంగా గృహహింస బాలికలపై వేధింపులు రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని కాబట్టి ప్రపంచ దేశాల నాయకులు అలర్ట్ గా ఉండాలని, మహిళలను కాపాడుకునే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు జారీ చేసింది. మహిళా హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా అన్ని దేశాల ప్రభుత్వాలు కొంచెం ఈ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటేనే పరిస్థితి కంట్రోల్లో ఉంటుందని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: