దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఉన్న కొద్దీ పెరుగుతూనే ఉన్నాయి. నాలుగో దశ లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత తీసుకున్న నిర్ణయాల వల్ల భయంకరంగా కొత్త పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. మొదటిలో 2000 తర్వాత రానురాను పది వేలు తర్వాత పదిహేను వేలు ఇప్పుడు 20 వేల కేసులు కొత్తగా నమోదు కావడంతో దేశంలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు మళ్లీ లాక్ డౌన్ లోకి వెళ్లి పోయే పరిస్థితి నెలకొంది. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా మరోసారి లాక్ డౌన్ అమలు చేయాలని ఇప్పటికే కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కరోనా వైరస్ అరికట్టడంలో దారుణంగా విఫలం అయినట్లు పేరు తెచ్చుకున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.

IHG

ఎక్కువ పాజిటివ్ కేసులు బయటపడుతున్న రాష్ట్రాలలో తమిళనాడు మొదటి వరుసలో ఉండటంతో...దాదాపు ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో కమ్యూనిటీ స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో పూర్తిగా తమిళనాడు రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు రాకపోకలను ఆపేయాలని కేంద్రం డిసైడ్ అవుతున్నట్లు అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా అనుకుంటున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి పళనిస్వామి సరైన నిర్ణయాలు తీసుకోలేదని తమిళ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి.

IHG'protected agriculture ...

దాదాపు 60 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ఏం చేయలేని పరిస్థితి తమిళనాడులో నెలకొంది. మొన్నటి వరకు తమిళనాడు రాష్ట్రంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలలో లాక్ డౌన్ మళ్లీ అమలు చేయడం జరిగింది. అయితే ప్రజెంట్ ఉన్న కొద్దీ వైరస్ కేసులు బాగా బయట పడుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ తమిళనాడు లో లాక్ డౌన్ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: