కరోనా అంటే ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. కానీ అంతగా భయపడాల్సింది లేదంటున్నారు ఓ సీనియర్ జర్నలిస్టు . ఆయన సొంత అనుభవం ఆయన మాటల్లోనే విందాం..

 

"నేను వృత్తి రీత్యా జర్నలిస్టును. 24 సంవత్సరాలుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పని చేస్తున్నాను. మీడియా మిత్రుని ద్వారా నాకు కరోనా సోకింది. నాకు positive వచ్చింది అని తెలియగానే ముందు నేను కొంత ఆందోళన పడ్డాను. వెంటనే మా కుటుంబ సభ్యులకు టెస్ట్ చేయించడంతో వారికి కూడా positive అని తేలింది. ఆందోళన నుంచి తేరుకొని నా మిత్రులు, శ్రేయోభిలాషులు సూచన మేరకు వెంటనే మా కుటుంబ సభ్యులు అందరం నేచర్ క్యూర్ హాస్పిటల్ లో చేరాము. హాస్పిటల్‌లో వైద్యులు ఇచ్చిన మెడిసిన్స్, అక్కడి వాతావరణం మమ్మల్ని వారం రోజుల్లోనే సాధారణ వ్యక్తులుగా మార్చింది.



మాకు ఇచ్చిన మెడిసిన్స్
*
ప్యారసిటమాల్-500mg టాబ్లెట్స్,
* B-Complex,
* C vitamin Tablets,
* Citrizen Tab,
* Ambroxel syrup (
దగ్గు ఉన్న వారికి మాత్రమే.)



నాకు కానీ, నా మిస్సెస్ కు కానీ పెద్దగా సింటెమ్స్ ఏమి లేవు. టెస్ట్ positive వచ్చిన తర్వాత రెండవ రోజు నుంచి మా ఇద్దరికీ కొంచం పొడి దగ్గు ప్రారంభం అయింది. జ్వరం ఉండేది కాదు కానీ, బాడీ feverish గా ఉండేది. డాక్టర్ల సూచన మేరకు మధ్యాహ్నం, రాత్రి భోజనం తర్వాత రోజుకు రెండు సార్లు paracitamal ట్యాబ్లేట్లు మూడు రోజులు వాడాము. పొడి దగ్గు ఉంది కాబట్టి దగ్గు సిరప్ ను ఉదయం 5ml, రాత్రి 5ml మూడురోజులు పాటు వాడాము. రోజుకు ఒకటి B- complex tablet, ఒకటి C-Vitamin tablet మధ్యాహ్నం భోజనం తర్వాత వారం రోజుల పాటు వేసుకున్నాము.

 


ఈ మెడిసిన్ తో పాటు మేము పాటించిన నియమాలు ఏమిటి అంటే. తప్పనిసరిగా వేడి నీళ్లు తాగడం. రోజు ఉదయం, సాయంత్రం వేడి నీళ్లలో జండుబామ్ కానీ, పసుపు కానీ వేసుకొని ఆవిరి పట్టడం. రోజుకు మూడు సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేడి నీళ్లలో నిమ్మకాయ రసం, తేనె కలుపుకొని తాగడం. రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు గొంతులో పోసుకొని garlic చేయడం (పుక్కిలించడం). రాత్రి భోజనం అనంతరం పడుకునే ముందు సగం గ్లాసు పాలల్లో కొంచం పసుపు, నాలుగు మిరియాలు దంచి పొడి చేసుకొని పాలల్లో కలిపి తాగడం.

 


వీటన్నిటినీ మేము వారం రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించడంతో వారం రోజుల్లోనే మేము సాధారణం స్ధితికి వచ్చేశాము. వీటికి తోడు మంచి ప్రొటీన్ ఫుడ్, రోజుకు రెండు మధ్యాహ్నం, రాత్రి భోజనంతో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినాలి. C-vitamin ఉన్న ఫ్రూట్స్ ఆపిల్, బత్తాయి, orenge వంటి పండ్లు ఎక్కువగా తినాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా తింటే కరోనా వచ్చిన వారు వారం రోజుల్లో సాధారణ స్థితికి వచేస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: