కరోనా చైనాలో మొదలైనప్పుడు దీని పూర్తి లక్షణాలు ఎలా ఉంటాయో సరిగ్గా ఎవరికి తెలియదు.. ఇక మనదేశంలో ఇది అడుగుపెట్టినప్పుడు అందరు చాలా తెలిగ్గా తీసుకున్నారు.. కాని కొద్ది రోజుల్లోనే అందరికి అర్ధం అయ్యింది. కరోనా అంటే ఏదో పలకరించడానికి వచ్చిన రోగం కాదని.. అప్పటి నుండి దీనికి వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇంతమంది మేధావులు, ఇన్ని దేశాలు తీవ్ర కృషి చేస్తున్న వారి ప్రయత్నాలు పరిశోధనలోనే ఉన్నాయి గాని దీన్ని పూర్తిగా నివారించడానికి ఒక్క మందు కూడా మార్కెట్లోకి రాలేదు..

 

 

ఈ దశలో కరోనా వైరస్ వివిధ లక్షణాలతో, తన బలాన్ని రోజు రోజుకు పుంజుకుంటూ ప్రస్తుత పరిస్దితుల్లో ప్రజలను ఊపిరి పీల్చుకోకుండా చేస్తుంది.. ప్రస్తుతం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక రూపంలో అందరికి యముడిలా మారింది.. ఇకపోతే జూన్ 21న సంభ‌వించిన సూర్యగ్రహణం రోజున నిర్వ‌హించిన ఒక పూజా కార్య‌క్ర‌మంలో హరియ‌ణాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ ‌సుధా కోవిడ్ 19 బారిన‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌న పర్సనల్ అసిస్టెంట్ అరుణ్ గులాటి మీడియాకు తెలిపారు. ఆయనతో పాటుగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కు త‌ర‌లించారు.

 

 

ఇకపోతే ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది హాజరయ్యారట.. మరి ఇంతమందిలో ఎంతమంది సేఫ్ జోన్లో ఉంటారో తెలియదు.. ఇక ఇప్పటికే హరియ‌ణాలో మొత్తం 13,829 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, 223 మంది మృతిచెందారు. ఇలాంటి పరిస్దితుల్లో ఎవరు కూడా ఇంట్లోనుండి బయటకు వెళ్లకపోవడం ఉత్తమం అని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా, సామూహిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ఇలా కరోనా వ్యాపిస్తుంది..

 

 

ఈ సమయంలో సోషల్ డిస్టెన్స్ అనేది ఎంత ముఖ్యమైనదో తెలిసినా కూడా పాటించకపోవడం దురదృష్టకరం.. ఇక వర్షాకాలం ఆరంభంలోనే పరిస్దితి తీవ్రత ఇంత భయంకరంగా ఉంటే.. ముందు ముందు ఎదురయ్యే రోజులు మరింత ప్రమాదకరంగా ఉంటాయని సందేహించడంలో అనుమానం లేదు..  

మరింత సమాచారం తెలుసుకోండి: