తెలుగు రాష్ట్రాల్లో ఫిబ్రవరి మాసం నుంచి కరోనా కేసులు నమోదు కావడం మొదలయ్యాయి. ఇక మార్చి 24 నుంచి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో రవానా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.  జనసందోహం ఉన్న ప్రదేశాలు మొత్తం మూసివేశారు.  ఈ ఎఫెక్ట్ ఇరు రాష్ట్రాల ఆర్టీసీ వ్యవస్థపై పడింది.  ఈ మద్య లాక్ డౌన్ సడలించారు.. దాంతో కొన్ని ఆంక్షల మేరకు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. సీట్ల సర్ధుబాటు.. లిమిటెడ్ ప్యాసింజర్లతో బస్సులు నడుస్తున్నాయి. తాజాగా ఏపిలో మరో సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

 

ఎటువంటి బస్ కైనా నగదు రహిత, కాంటాక్ట్ రహిత టికెటింగ్ విధానాన్ని రూపొందించాలని ఇప్పటికే నిర్ణయించిన ఏపీఎస్ ఆర్టీసీ, జులై 1వ తేదీ నుంచి కొత్త సేవలను అందుబాటులోకి తేనుంది.  ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ వ్యవస్థను ఆధునికీకరిస్తున్నామని, అన్ని బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ టికెట్లను జారీ చేయనున్నామని అధికారులు వెల్లడించారు.

 

ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు సర్వర్ లను అప్ గ్రేడ్ చేసేందుకు 30వ తేదీ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ ఆర్టీసీ వెబ్ సైట్ ను నిలిపివేస్తామని, ఆ సమయంలో అన్ని రకాల టికెట్ బుకింగ్, రద్దు సేవలు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.  సుమారు 50 వేల మంది టికెట్లను పొందినా వెబ్ సైట్ పై ఒత్తిడి పడకుండా సేవలను అందిస్తామని తెలిపారు. ఈ మద్య ఏపిలో కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: