కరోనా.. ఈ పేరు వింటేనే ఇప్పుడు వంట్లో వణుకుపుడుతోంది. అందులోనూ హైదరాబాద్ లో కరోనా విజృంభణ మామూలుగా లేదు.. రోజూ దాదాపు వెయ్యి కేసులు వస్తున్నాయి. అయితే కరోనా అంటే అంతగా భయపడాల్సిన పని లేదని దాన్ని జయించిన కొందరు చెబుతున్నారు.

 

 

అలా కరోనాను జయించిన వారిలో హైదరాబాద్ క్రైం బ్రాంచ్ అదనపు కమిషనర్‌ షికా గోయల్ ఒకరు. ఆమె కరోనాను విజయవంతంగా జయించారు. కొవిడ్‌-19 విపత్కర పరిస్థితుల్లో వలస కూలీలు, లాక్‌డౌన్‌ అమలు కోసం ఆమె క్షేత్ర స్థాయిలో పనిచేశారు. ఆమె విధుల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ సోకింది.

 

 

అయితే ఐపీఎస్ కావడంతో పెద్దగా భయపడలేదు. ఇలాంటి సమయంలో ఎంత ధైర్యంగా ఉంటే అంత త్వరగా కోలుకోవచ్చని నమ్మారు. ఆమెకు ఎలాంటి లక్షణాలు లేకున్నా ఇంటికే పరిమితమయ్యారు. రోజూ పోషకాహారం తీసుకున్నారు.

 

 

షికా గోయల్ ప్రతిరోజూ ఆవిరి తీసుకునేవారు. అలాగే కొన్ని వంటింటి చిట్కాలు పాటించారు. తులసి ఆకులు, పసుపు, మిరియాలు, అల్లం నీటిలో వేడి చేసిన మిశ్రమం తీసుకున్నారు. కరోనా విషయంలో అంతగా భయపడాల్సిన పని లేదంటున్నారామె. దీన్ని ఓ సాధారణ ఫ్లూగా భావించాలని.. కాకపోతే.. నిర్లక్ష్యం చేయొద్దని సలహా ఇస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: