దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 19,459 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒక్క రోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 380 మంది మరణించారు.  ఇప్పటి వరకు మొత్తం 5,48,318కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 16,475కి పెరిగింది. 2,10,120 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా నిన్న ఒక్కరోజే 1,70,560 శాంపిళ్లను సేకరించి పరీక్షలు జరిపారు.  దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 3,21,723 మంది కోలుకున్నారు. మరోవైపు పంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,02,43,858 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారి కారణంగా 5,04,410 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

 

కరోనా బారినపడిన వారిలో 55,53,495 మంది కోలుకోగా, 41,85,953 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. అగ్రరాజ్యలే దీని విలయానికి తట్టుకోలేకపోతున్నాయి.  ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం, మాస్కులు ధరించాలని చెబుతున్నారు. వైరస్ సోకిన తర్వాత బాధపడే కంటే ముందుగా మాస్కులు ధరించడమే ఉత్తమమని అంటున్నారు. అయినా కూడా చాలా మంది ఈ ఆదేశాలను లెక్కచేయడం లేదు. యదేశ్చగా మాస్కులు లేకుండానే రోడ్లపై తిరుగుతున్నారు.

 

దీంతో ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు బెంగుళూరు పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ఎవరైనా మాస్కులు లేకుండా బయటకు వస్తే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. నగర పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు సోషల్ మాద్యమం ద్వారా తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారికి అధికారులు కేవలం హెచ్చరికలే చేస్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో మాత్రం క్రిమినల్ కేసులు ఉంటాయని పేర్కొనడంతో ఇప్పుడైనా మార్పు రావాలని నగర వాసులు ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: