గాల్వాన్ లోయలో డ్రాగన్ సైనికుల దాడి తరువాత ఇండియాలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ పెరుగుతున్నది. కాగా, హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన బేగంబజార్, సిద్ధి అంబర్ బజార్, ఫీల్‌ఖానా హోల్‌సేల్ వ్యాపారస్తులు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై చైనా ఉత్పత్తులను ఏమాత్రం విక్రయించరాదని సంచలన నిర్ణయం తీసుకున్నారు. చైనా వస్తువులను బహిష్కరించాల్సిందేనని దేశవ్యాప్త డిమాండ్ ఉద్ధృతంగా తిరిగి ప్రచారంలోకి వచ్చింది. గాల్వాన్ సంఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా చైనా జెండాలను, చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్న విషయం తెలిసిందే.  

IHG

ఈ సందర్భంగా ఓ సైనికుడు భారత ప్రజల కోసం ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  మేం చైనా బోర్డర్‌కు వెళ్తున్నాం... ఇక్కడ రోడ్డు కూడా సరిగ్గా లేదు. ఇక్కడ నుంచి పర్వతాల మీదుగా అక్కడికి చేరుకోవాలి. మీరు ఇళ్లల్లో సురక్షితంగా ఉండండి. దేశంకోసం మేం పోరాడతాం. చైనా యాప్, ఉత్పత్తులను బాయ్‌కట్ చేయడం మీ చేతుల్లో పని అంటూ మెసేజ్ పెట్టిన విషయం తెలిసిందే. దాంతో ప్రతి పౌరుడు ఇప్పుడు చైనా వస్తువులు అంటే భగ్గుమంటున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రా వాసులు చైనా తీరును నిరసిస్తూ... మేడిన్ చైనా వస్తువులను దహనం చేస్తున్నారు.

IHG ఉద్యమంలో ...

చైనా వస్తువులను బహిష్కరించి, ఆ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తామని అంటున్నారు. నగరంలోని కూడళ్లలో చైనా వస్తువులను వేసి దగ్ధం చేస్తున్నారు. చైనాలో తయారైన ఫోన్లు, టీవీలను సైతం తగలబెట్టారు. చైనా వస్తువులను తగలబెట్టడం ద్వారా అమర వీరులకు నివాళి అర్పిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు.  అంతేకాదు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. దీపావళి నాటికి చైనా వస్తువులు అనేవి మన ఇండియాలో లేకండా చేయడమే ఆ వీర సైనికులకు మనందరం ఇచ్చే అసలైన నివాళి అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: