వర్షాకాలంలో నేరేడు పండ్లు బాగా కాస్తాయి. పిల్లలు, పెద్దలు వాటిని ఇష్టంగా తింటారు. ఇక చెట్టు మీద ఉన్న వాటి కోసం కొంత మంది పిల్లలు చెట్టుపైకి రాళ్లు విసిరారు. కానీ, ఆ రాళ్ళు చెట్టుకు తగలకుండా చెట్టుకు కట్టేసిన దున్నపోతు కి తగిలాయి. దీనితో దున్నపోతు యజమాని రాళ్లు విసిరిన పిల్లలను దుర్భాషలాడాడు. దీనితో పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి యజమానిని కొట్టి చంపేశారు. ఈ దారుణమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.

IHG


ఈ విషయం సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డియో రాయి జిల్లాలోని చందౌలి గ్రామంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జై ప్రకాష్ అనే వ్యక్తి ఒక దున్నపోతుల కాపరి. ఓ దున్నపోతును నేరేడు పళ్ళ చెట్టుకు కట్టేసాడు. అయితే కొంతమంది పిల్లలు నేరేడు పండ్ల కోసం చెట్టు పై రాళ్ళు విసిరారు. ఆ రాళ్లు కాస్త తగలడంతో మొదట ప్రకాష్ పిల్లలకు చెట్టుపై రాళ్లు వేయవద్దు అంటూ తెలియజేశాడు. అయినా కూడా పిల్లలు అతని మాట పట్టించుకోలేదు. దీనితో కోపంతో ప్రకాష్ పిల్లలను దుర్భాషలాడాడు.

 


దీనితో పిల్లలలో ఒకరి తండ్రి అయిన అన్సారీ అనే వ్యక్తి తమ పిల్లలను ఎందుకు తిట్టావు అని ప్రకాష్ వద్దకు వచ్చి గొడవ చేశాడు. చిన్న గొడవ కాస్త బాగా పెద్దది కావడంతో అక్కడ అందరూ కలిసి ప్రకాష్ ను కొట్టి చంపేశారు. ఇక సంఘటన విషయాలు తెలుసుకున్న పోలీస్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రకాష్ మృతదేహాన్ని పోలీస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. నిజంగా ఇంత చిన్న విషయానికి ప్రాణం తీసేయడం ఎంతవరకు సబబో.

మరింత సమాచారం తెలుసుకోండి: