జనసేన ఎమ్మెల్యేగా గెలుపొందిన రోజు దగ్గర నుంచి రాపాక వరప్రసాద్ వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీ విధానాలను పట్టించుకోకుండా, సొంతంగా ఆయన వ్యవహరిస్తూ, పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతూనే వస్తున్నారు. ఇక గెలిచిన దగ్గర నుంచి జనసేన పార్టీ నియమాలు పాటించకుండా పూర్తిగా, వైసీపీ అనుబంధ సభ్యుడిగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. జగన్ ఫోటో కు పాలాభిషేకం చేయడం, పదే పదే ఏపీ సీఎం  జగన్ తీరు ను పొగుడుతూ ఉండడం వంటి పరిణామాలు జనసేన కార్యకర్తలకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. ఇది ఇలా ఉండగానే తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

IHG

ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వైసిపి కార్యక్రమాలు బాగున్నాయని, అందుకే ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నానంటూ వ్యాఖ్యానించారు. జనసేన పార్టీకి అధినేత ఒక్కరే ఉన్నారని, క్యాడర్ లేదని, తాను పార్టీ కమిటీలు నియమించాలి అని చెప్పినా పట్టించుకోలేదని, ఈ సందర్భంగా రాపాక వ్యాఖ్యానించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి పవన్ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, చిరంజీవి అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం అని, పవన్ మాత్రం అలా కాదు అని చెప్పుకొచ్చారు. నాయకత్వం అంటే జగన్ లా ఉండాలని రాపాక అన్నారు. అసలు జనసేన పవన్ ను నాదెండ్ల మనోహర్ రాంగ్ ట్రాక్ లోకి తీసుకెళ్తున్నారని మండిపడ్డారు. 


గెలిచిన తనను పక్కన పెట్టుకోకుండా, నాదెండ్ల మనోహర్ ను పక్కన పెట్టుకోవడాన్ని అందరూ గమనించాలన్నారు. పార్టీలో ఉన్న వాళ్ళ అభిప్రాయం కూడా ఇదేనని, అసలు ఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తనను పిలవలేదని, అయినా తాను వెళ్లి అడిగితే బొట్టు పెట్టి పిలవరు కదా అని మనోహర్ దురుసు గా వ్యాఖ్యానించారని, తానే కుర్చీ తెచ్చుకుని కూర్చోవడం వంటి సంఘటనలు అందరూ చూశారని రాపాక అన్నారు. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు ఓటు వేసి గెలిపించడానికి పని చేయారని ,పార్టీ అభివృద్ధికి పనికిరారని, కేవలం మరొకరిని తిట్టేందుకు మాత్రమే వారు పనికి వస్తారు అని తన మనసులోని బాధను చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: