సాధారణంగా పొలాలు, ఇంటి ప‌రిస‌రాల్లో బోర్లు వేసిన త‌ర్వాత నీళ్లు ప‌డ‌క‌పోతే ఆ గుంట‌ల‌ను అలానే వ‌దిలేయ‌డంతో అందులో చిన్నారులు ప‌డి ప్రాణాలు కోల్పోయిన సంఘ‌న‌లు చాలానే చూశాం.  ఇలా ఎన్నో ప్ర‌మాదాలు జ‌రిగిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌ల్లో మార్పు రాలేదు.  అయితే బోరు బావిలో ఓ మేకపిల్ల పడింది.. దాన్ని ఓ యువకుడు ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఒక పొలంలో మ‌నిషి ప‌ట్టేంత ప‌రిమాణంలో లోతైన గుంట‌ తవ్వి వదిలారు.  ఆ గుంటలో ప్రమదా వశాత్తు ఓ మేకపిల్ల పడిపోయింది..  ప్రాణాల‌తో గిల‌గిల కొట్టుకుంటున్నా.. అరుపులు బ‌య‌ట‌కు వినిపించ‌లేదు. అటుగా వెళ్లిన మేక‌పిల్ల‌ను గ‌మ‌నించిన‌ కుర్రాళ్లు దానికి బ‌య‌ట‌కు తీసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. మేక‌పిల్ల‌ను ర‌క్షించ‌డానికి వారంతా బృందం దేశీ ప‌ద్ద‌తుతిని ఉప‌యోగించారు.  

 

అస్సాం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హర్దీ సింగ్ దీనికి సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. దీంతో అది వైరల్ అయింది. వారు చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ఇలాంటి రిస్కులు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. గుంటలో మేకపిల్ల పడ్డ తర్వాత అది అరవడం మొదలు పెట్టింది.   స్థానిక యువకులు గమనించి అక్కడికి వెళ్లారు. దాని ఆర్తనాదాలు విని ఎలాగైనా బయటకు తీయాలని నిర్ణయించుకున్నారు. గొయ్యి చిన్నగా ఉండటంతో ధైర్యం చేసి ఓ వ్యక్తి తాను లోపలికి దూరుతానని ముందుకు వచ్చాడు.

 

న‌లుగురు బృందంలో ఒక‌రు లోప‌లికి వెళ్లేందుకు సిద్ద‌మయ్యారు. మిగిలిన ముగ్గురు అత‌ని కాళ్ల‌ను ప‌ట్టుకొని నిదానంగా గుంట‌లోకి దించారు.  అతడు అటూ ఇటూ వెతికి అతి కష్టం మీద మేకను పట్టుకోగానే అంతా కలిసి బలంగా పైకి లాగారు. పైకి రాగానే ఆ మేకను నేలపై వదిలాడు. ప్రాణాపాయం నుంచి బయటపడిన ఈ మేక బతుకు జీవుడా అంటూ సంతోషంగా పరుగులు పెట్టింది. దీన్నంతటిని అక్కడ ఉన్న మరో వ్యక్తి వీడియో తీయడంతో వారు చేసిన పని బయటి ప్రపంచానికి తెలిసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: