ఎంత కష్టం అయిన సరే దైర్యంగా ఎదుర్కోవాలి. అంతేకాని ఆత్మహత్య అనేది చేసుకోకూడదు. బలవంతముగా చనిపోవడం అనేది అసలు చేయకూడదు. కష్టాలు వచ్చాయి అని చనిపోతే ఎలా. వాటిని ఎలా ఎదుర్కొనాలి అని ఆలోచించాలి గాని ప్రతి దానికి చావడం అనేది పరిష్కారం కాదు. మనం చనిపోయే ముందు ఒక్కసారి మన తల్లితండ్రులు, భార్య పిల్లల పరిస్థితి ఆలోచించాలి. ఇవేమి ఆలోచించకుండా ఒక వ్యక్తి  ఆత్మహత్య ప్రయత్నం చేసాడు. సమయానికి పోలీసులు అతన్ని గమనించి కాపాడగలిగారు లేదంటే ఒక నిండు ప్రాణం బలి అయిపోయేది. ఈ ఘటన  పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో చోటుచేసుకుంది.

 

 

అతను  సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో   కుటుంబ సమస్యల కారణంతో గోదావరి బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. వివరాలలోకి వెళితే  విజయ్ అనే వ్యక్తి అన్నపూర్ణ కాలనీలో గత కొంత కాలంగా  నివాసం ఉంటున్నాడు. అయితే  కొంతకాలంగా కుటుంబ సమస్యలతో  కొన్ని కలహాలు జరిగాయట దీనితో తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే గోదావరి బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్య కి పాల్పడ్డాడు. దీంతో అతడ్ని చూసిన గోదావరి రివర్ పోలీసులు ప్రాణాలతో కాపాడారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని గోదావరి బ్రిడ్జి పై నుండి దూకి ఆత్మహత్యకి ప్రయత్నించాడు.

 

 

ఆ సమయంలో అక్కడే ఉన్న గోదావరి రివర్ పోలీసులు పీసీ  3376 రమేష్ కుమార్ ,పీసీ 2759 శంకరయ్యలు  వెంటనే అప్రమత్తం అయ్యి ఆ వ్యక్తిని కాపాడారు. విజయ్ ను  కాపాడిన  వెంటనే ఈ విషయంపై అధికారులకు సమాచారం కూడా అందించారు. అధికారులు విజయ్  కుటుంబ సభ్యులను పిలిపించి ఆ ఘటన గురించి చెప్పారు. అంతేకాకుండా  విజయ్ కి, వారి కుటుంబ సభ్యులకు  కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం విజయ్ ని కుటుంభ సభ్యులతో ఇంటికి పంపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: