ఈ అనంత విశ్వంలో మనం ఎన్నో రకాల వస్తువులను చూస్తుంటాం.. కొన్ని వస్తువులు మనల్ని అబ్బుర పరిస్తే మరికొన్ని భయభ్రాంతులకు గురి చేస్తుంటాయి.  అనాధిగా మనిషి ఈ భూమిపై జీవరాశులతో పయణం చేస్తున్న విషయం తెలిసిందే.  అయితే ఈ విశ్వంలో వేరే గ్రహాల్లో జీవ రాశి ఉన్నదని నమ్ముతున్నారు.  వాటినే కొంత మంది ఏలియన్స్ అంటుంటారు.  ఈ ఏలియన్స్ పై ఎన్నో కథనాలు వచ్చాయి.. సినిమాలు చూశాం.  అప్పుడప్పుడు మన మద్య కొన్ని అతీత శక్తులతో ఏలియన్స్ తిరుగుతున్నాయని.. వాటి ఫోటోలు కూడా కొంత మంది ఔత్సాహికులు సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తుంటారు.

 

 విశ్వంలో ఇప్పుడు అత్యంత టెక్నాలజీ.. టెలీస్కోప్ తో ఎన్నో నక్షత్రాలు, గ్రహాలను తిలకిస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది.. ఆ ఫోటో చూసి అందరూ దాన్ని మంచి మసాల దోశె అంటున్నారు. లేదు.. అది ప్లేన్ దోశ కాకపోతే వెరైటీగా వేశారు.. కాస్త మాడగొట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ ఫోటో ఏంటా అనుకుంటున్నారా?   ఈ ఫోటోపై నాసా క్లారిటీ ఇచ్చింది.

 

అది దోశ కాదు.. 2000వ సంవ‌త్స‌రంలో నాసా తీసిన బృహ‌స్ప‌తి ఫొటో’ అని తెలిపింది.  అది బాగా పాటించి చూసిన మరికొందరు ‘అవును ఇది బృహస్పతియే’ అని నిర్ధారణకు వచ్చారు. కాగా,  మొన్న సూర్యుడి వీడియో సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లను ఎంత‌గా అబ్బుర ప‌రిచిందో తెలిసిందే. నాసా ఈ వీడియోను రూపొందించింది. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రిజల్యూషన్‌ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించింది. నాసా వారు ఇప్పటి వరకు అంతరిక్షానికి చెందిన అద్భుతమైన ఫోటోలు షేర్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇటీవల సూర్యడి ని అత్యంత సమీపం నుంచి ఫోటో తీయగా బంగారం వన్నెలా కనిపించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: