స్వీట్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక బెంగాలీ వారు అయితే స్వీట్స్ ను చాలా ఇష్టపడతారు. కరోనా వైరస్ పై పోరాడేందుకు ఉపయోగపడే రోగనిరోధక శక్తిని పెంచే స్వీట్లను మార్కెట్లోకి విడుదల చేశామని బెంగాల్ రాష్ట్ర అధికారులు తెలిపారు.  ప్రముఖ సుందర్బన్ అడవిలో నుంచి సేకరించిన తేన, స్వచ్ఛమైన ఆవు పాలు, తులసి రసంతో తయారుచేసిన ఈ సీట్లకు ఆరోగ్య సందేశం అని పేరు కూడా పెట్టారు. ఈ స్వీట్లను పూర్తిగా సహజమైన పద్ధతిలో తయారు చేశారు. అలాగే ఈ స్వీట్ తయారీలో ఎలాంటి కృత్రిమ పదార్థాలు రంగులు కూడా ఉపయోగించలేదు అని జంతు వనరుల అభివృద్ధి శాఖ అధికారి జాతీయ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలియజేశారు. 

 


ఇక ఈ స్వీట్స్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన తెలియజేశారు. అయితే స్వీట్స్ కోసం కేవలం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కానీ కరోనాకు విరుగుడు మందు కాదని తెలియజేశారు. ఇది ఈ స్వీట్స్ నిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్యపాత్ర ఉందని ఆయన స్పష్టంగా తెలియజేశారు. ఈ స్వీట్స్ కు ప్రభుత్వ అనుమతి కూడా లభించిందని ఆ అధికారి పేర్కొన్నారు. దీనితో అతి త్వరలోనే సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో మార్కెట్లోకి అందిస్తామని సుందర్బన్ వ్యవహారాల మంత్రి మధురం ఫకీర్ తెలియజేశారు.

 


ఇక ఈ నెల మొదట్లో ప్రాముఖ్య మిఠాయి తయారీ సంస్థ అయిన ఇమ్యూనిటీ సందేశ్ పేరుతో ఈ స్వీట్ ను తయారు చేసిందని ఆయన తెలియజేశారు. ఈ స్వీట్స్ లో సహజసిద్ధమైన పసుపు, తులసి, కుంకుమ, యాలకులు, మూలికలతో స్వీట్స్ తయారు చేశామని వివిధ పరిశోధనలలో అనంతరం దీనిని ప్రభుత్వం గుర్తింపు లభించిందని ఆయన ఆ ఇంటర్వ్యూలో తెలియజేశారు. దాంతోపాటు ఈ స్వీట్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నట్లు శాస్త్రీయంగా అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: