తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఎందరో ముఖ్యమంత్రులు పాలన సాగించిన భవనాలు ఇక కాల గర్భంలో కలిసిపోనున్నాయి. ఎన్నో ఘటనలు ,నిర్ణయాలకు సాక్షీ భూతంగా నిలిచి... రాష్ట్ర పాలనకే గుండె కాయగా ఉన్న ఆ భవనాలు ఇక కనుమరుగు కాబోతున్నాయి.

 

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. దీంతో సచివాలయం కూల్చివేతకు ఎదురైన అడ్డంకులన్నీ తొలగిపోయినట్టైంది. సచివాలయం కూల్చివేతపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. ప్రభుత్వ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. దీంతో సచివాలయం కూల్చివేతపై వేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. కేబినెట్‌ నిర్ణయాన్ని తప్పుబట్టలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు తరుణంలో.. పాత సచివాలయాన్ని కూల్చి.. కొత్త సెకట్రేరియట్ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టనుంది.

 

పాత సెక్రటేరియట్ లో సరైన వసతులు లేవని... కొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని.. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. పాత సచివాలయం స్థానం లోనే కొత్త సచివాలయంని కట్టాలని డిసైడయ్యారు. గతేడాది జూన్ 27 న కొత్త సచివాలయ నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. అయితే కోర్ట్ లో కేసు వేయడం.. కోర్టు సెక్రటేరియట్ భవనాలు కూలచొద్దని స్టే ఇవ్వడం తో.. కొత్త సెక్రటేరియట్ సంబంధించిన పనులు ముందుకు సాగలేదు... ప్రస్తుత భవనాలు కొత్త సెక్రటేరియట్ నిర్మాణమ్ పై కాబినెట్ సబ్ కమిటి ని సీఎం వేశారు... కేబినేట్ సబ్ కమిటీ అన్ని పరిశీలించి ప్రస్తుత భవనాలు సేఫ్ కాదని... అవసరాల కు అనుగుణంగా లేవని రిపోర్ట్ ఇచ్చింది.

 

కొంత కాలంగా ఈ కేసు కోర్ట్ లో ఉండడం తో ఎలాంటి కార్యకలాపాలు జరగ లేదు. కోర్ట్ తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ కొనసాగింది. ఇప్పుడు కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో కొత్త సచివాలయ నిర్మాణం కి సంబంధించిన పనులు వేగం పుంజుకొనున్నాయి. వీలైనంత త్వరగా కొత్త భవనాలు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: