రాష్ట్రంలో ఫుల్ మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతల్లో మంత్రి కొడాలి నాని ఒకరు. గుడివాడ నియోజకవర్గానికి చెందిన కొడాలి నానికి రాష్ట్రమంతా మంచి క్రేజ్ ఉంది. కొడాలి ఎక్కడ ఉంటే అక్కడ జనం తాకిడి ఎక్కువగానే ఉంటుంది. ఇక సొంత నియోజకవర్గం గుడివాడలో అయితే కొడాలి ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆయన ఏదైనా గ్రామలో పర్యటిస్తున్నారంటే చాలు, అక్కడకి జనం భారీగా తరలివస్తారు. పైగా సొంత ఖర్చులతోన కొడాలికి బ్యానర్లు కట్టే అభిమానులు ఉన్నారు. 

 

ఇక ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే...కొడాలికి కేవలం వైసీపీ వాళ్లే అభిమానులుగా లేరు. టీడీపీలో కూడా కొడాలికి అభిమానులు ఉన్నారు. టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కొడాలి గుడివాడ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక టీడీపీ నుంచి రెండు సార్లు గెలిచారు. ఆ రెండు పర్యాయాలల్లోనే కొడాలికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. పేద, ధనిక అంటూ తేడా లేకుండా అందరితో ఆప్యాయంగా మాట్లాడే కొడాలి అంటే టీడీపీ కార్యకర్తలు విపరీతమైన అభిమానం పెరిగింది. కానీ తర్వాత నాని వైసీపీలోకి వెళ్ళినా కూడా కొందరు అభిమానులు ఆయనతో కలిసి నడవలేదు. టీడీపీ అంటే ఇష్టంతో ఇక్కడే ఉండిపోయారు.

 

అయితే వారు తర్వాత ఎన్నికల్లో కొడాలికి ఓటు వేయకపోయినా సరే, ఆయన అంటే ఇష్టంగానే ఉంటారు. కానీ 2019 ఎన్నికల్లో నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన తర్వాత కొడాలి నాని వ్యవహారశైలి మారిందని తెలుగు తమ్ముళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి అయ్యాక కొడాలి మాట తీరు బాగోలేదని, పదే పదే చంద్రబాబుని, లోకేష్‌ని వ్యక్తిగతంగా తిట్టడం కరెక్ట్ కాదని, రాజకీయ పరంగా విమర్శలు చేస్తే ఇబ్బంది లేదని, కానీ కొడాలి కాస్త పరుష పదజాలం వాడుతున్నారని అంటున్నారు. ఇలా తమకు ఇష్టమైన కొడాలి, తమ పార్టీ అధినేతని అంతలా దూషించడం బాగోలేదని తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: