2019 ఎన్నికల తర్వాత చాలా టీడీపీ కంచుకోటలు వైసీపీ పరమైపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడు ఓటమి కూడా ఎరుగని నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. అయితే ఎన్నికలైన తర్వాత కూడా టీడీపీ ఇంకా వీక్ అయిపోతుంది. నేతలు వలస వెళ్లిపోతుండటంతో చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి వీక్ అయింది. అవి నిదానంగా వైసీపీ హ్యాండ్‌లోకి వెళ్లిపోతున్నాయి. భవిష్యత్‌ ఎన్నికల్లో అలాంటి నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపు కష్టమని అర్ధమైపోతుంది.

 

ఇక అలా వైసీపీ అడ్డాగా మారిపోయిన టీడీపీ కంచుకోటల్లో కృష్ణా జిల్లా గన్నవరం కూడా ఒకటి. గన్నవరంలో టీడీపీ ఎక్కువసార్లు విజయం సాధించింది. గత రెండు పర్యాయాలు కూడా ఇక్కడ టీడీపీకే విజయం దక్కింది. 2014, 2019 ఎన్నికల్లో వల్లభనేని వంశీ వరుసగా విజయం సాధించారు. అయితే వంశీ టీడీపీ మీద అసంతృప్తితో వైసీపీ వైపు వచ్చేశారు. కాకపోతే డైరక్ట్‌గా వైసీపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని, చెప్పి తెలివిగా టీడీపీని వీడి, జగన్ కు మద్ధతు తెలుపుతున్నట్లు ప్రకటించారు.

 

అంటే వంశీ అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో మాత్రం వంశీ, వైసీపీ గుర్తు మీద పోటీ చేయడం ఖాయం. అందుకే మొన్న ఎన్నికల్లో వంశీ మీద ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావుకు జగన్ కృష్ణా కోపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ పదవి ఇచ్చేశారు. దీంతో వంశీకి లైన్ క్లియర్ అయిపోయింది. అయితే వంశీ వైసీపీ నుంచి బరిలో దిగితే టీడీపీ నుంచి ఎవరు ఉంటారనేది అర్ధం కాకుండా ఉంది.

 

ఇప్పటికీ ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడు ఎవరో తెలియలేదు. దీంతో ఇక్కడ రోజురోజుకూ టీడీపీ వీక్ అయిపోతుంది. అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తరుపున నిలబడటానికి అభ్యర్ధులే కరువయ్యారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా అని నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరోకరిని టీడీపీ తరుపున బరిలో దింపినా...ఇక్కడ విజయం మాత్రం వంశీదే అని అర్ధమైపోతుంది. మొత్తానికైతే టీడీపీకి కంచుకోటలాగా ఉండే గన్నవరం వైసీపీకి అడ్డాగా మారిపోయిందనే చెప్పుకోవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: