ప్రస్తుతం భారత్ చైనా సరిహద్దుల్లో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు భారత్ మరో వైపు చైనా సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరిస్తుంది. అయితే చైనా సైన్యం మానసికంగా భారత సైన్యాన్ని దెబ్బతీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది, ఈ క్రమంలోనే ఎన్నో వార్తలను కూడా ప్రచురిస్తోంది. ఇలా ఎన్నో వార్తలు ప్రచురితం చేసి మానసికంగా భారత సైన్యం బలం తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఇలాంటి ఒక వ్యూహం పన్నింది చైనా. చైనా లో ఉన్నటువంటి మీడియాలో ఒక ప్రత్యేకమైన ప్రొజెక్షన్ జరిగింది. 

 

 చైనాలో కొన్ని ప్రత్యేకమైన టువంటి డివిజన్లను ఏర్పాటు చేసుకున్నామని... వందలాదిమంది మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన అటువంటి సైనికులు ఉన్నారని... టిబెట్లో ఉన్న వాళ్ళని ప్రస్తుతం భారత సరిహద్దుల వైపు పంపించాము  అని... ఇప్పుడు చైనా భారత్ సరిహద్దుల వద్ద ఎంతో పవర్ఫుల్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు అంటూ చైనా ఒక వాదన తెరమీదికి తెచ్చింది. అయితే దీనిపై అంతర్జాతీయ మీడియా అసలు నిజాన్ని బయటకి చెప్పేసింది. అసలు అలాంటి మార్షల్ ఆర్ట్స్ సైన్స్ అనేది లేదని... ప్రస్తుతం అలా మార్షల్ ఆర్ట్స్  సైన్యాన్ని తయారు చేసేందుకు చైనా ప్రయత్నం మొదలు పెట్టింది  తప్ప ఇప్పటికే శిక్షణ తీసుకున్న సైన్యం మాత్రం లేదు అని స్పష్టం చేసింది. 

 

 అయితే చైనా ఇలా సరికొత్త వాదనను తెరమీదకు తీసుకు రావడానికి కారణం భారత సైన్యం లో ఉన్న ఘాతుక్ టీమ్ అని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఏదైనా దేశ సైన్యం తో ఫిజికల్గా యుధ్ధానికి దిగాల్సి వచ్చినప్పుడు ఈ ఘాతుక్  టీమ్  ప్రత్యర్ధి దేశాల మీద పడి పోయే మెడలో విరిచేయ గలదు. దీనికోసం ప్రత్యేకంగా ఎన్నో ఏళ్ళ పాటు శిక్షణ తీసుకుని సెకన్ల సమయంలోనే మనిషిని చంపేయగల సత్తా ఈ ఘాతుక్ టీమ్ లోని  సభ్యులకు  ఉంటుంది. హరహర మహాదేవ్ అంటూ నినాదాలు చేస్తూ భయంకరంగా మీద పడిపోయి ప్రాణాలు తీసేస్తూ ఉంటారు ఈ టీమ్ సభ్యులు వీళ్లకు భయపడే చైనా ప్రస్తుతం ఇలా మార్షల్ ఆర్ట్స్  శిక్షణ సైన్యం ఉంది అనే వాదన తెరపైకి తెచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: