దేశంలో అత్యధికంగా కరోనా వైరస్ ప్రభావం ఉన్న రాష్ట్రాలలో ఢిల్లీ మొదటి వరుసలో ఉంది. దేశ రాజధాని కావడంతో వైరస్ ప్రభావం భయంకరంగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఢిల్లీలో ఉన్న పరిస్థితిని కంట్రోల్ చేయడానికి అనేక అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉండగా ప్లాస్మా థెరఫి విధానం ద్వారా కరోనా వైరస్ కంట్రోల్ చేయడం కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్లాస్మా థెరఫి బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల తెలపడం జరిగింది. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ వ్యాధి గ్రస్తులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కరోనా సోకడంతో మొదటిలో ఆవిధంగా కరోనా వైరస్ వల్ల ఏ వైద్యుడు అయినా చనిపోతే కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది.

 

ఈ నేపథ్యంలో సోమవారం మీడియా సమావేశం జరిగిన టైములో కరోనా వైరస్ వల్ల ఫ్రంట్ లైన్ లో ప్రజల ప్రాణాల తరఫున పోరాడుతున్న ఓ వైద్యుడిని కోల్పోవటంతో కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ సర్కారు నిర్వహిస్తున్న లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రిలో సీనియర్‌ డాక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ అసీమ్‌ గుప్తా కొవిడ్ రోగులకు విశేష సేవలు అందించారు. ఈ క్రమంలో జూన్ 6న ఆయనకి కూడా కరోనా వైరస్ సోకడం జరిగింది. మొదటిలో కరోనా లక్షణాలు కొద్దిగా బయటపడటంతో వెంటనే క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకోవడం జరిగింది.

 

కాగా అనంతరం భయంకరంగా అనారోగ్య లక్షణాలు బయటపడటంతో సదరు వైద్యుడిని లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత ఆయన విజ్ఞప్తి మేరకు సాకేత్‌లోని మ్యాక్స్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో మ్యాక్స్ ఆస్పత్రిలో ఆదివారం డాక్టర్ అసీమ్ గుప్తా కన్నుమూశారు. ఆయన భార్య కూడా వైద్యురాలు కావడంతో ఆమెకు కూడా కరోనా సోకిన చికిత్స తీసుకుని బయటపడటం జరిగింది. కాగా  చివరి వరకు ప్రాణాలతో పోరాడి చనిపోయిన ఆ వైద్యుడి కుటుంబానికి కేజ్రీవాల్ కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: