కేంద్ర ప్రభుత్వం అన్‌ లాక్ 2 రూల్స్ ప్రకటించింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి. రాత్రిపూట కర్ఫ్యూని రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5గంటలకు సడలించింది. మెట్రో రైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌పై నిషేధం ఇప్పటిలాగానే ఉంటుంది. సామాజిక, రాజకీయ, మతపరమైన కార్యకలాపాలపైనా నిషేధం ప్రస్తుతం ఉన్నట్టుగానే ఉంటుంది. ఎలాంటి మినహాంపులు లేవు.

 

 

ఇక ఇతర నిబంధనల విషయానికి వస్తే.. అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులను కొనసాగుతాయి. బయట తిరిగేవారంతా ముఖానికి మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ప్రయాణ సమయం మొత్తం ప్రయాణికులు మాస్క్‌ ధరించాలి. బయటకు వచ్చినప్పుడు, బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం అంటే.. 6 అడుగుల దూరాన్ని పాటించాలి.

 

 

భారీ సంఖ్యలో జనం గుమిగూడటం నిషేధం. వివాహ, వివాహ సంబంధ కార్యక్రమాలకు 50మంది వరకే హాజరు కావాలి. ఎవరైనా చనిపోతే.. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు 20మందికి మాత్రమే అనుమతి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడం నిషేధం, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.

 

 

బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం. అవకాశం ఉన్నంత వరకూ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసేందుకే అవకాశం ఇవ్వాలి. పని ప్రదేశాలు, ఎక్కువమంది సంచరించే ప్రాంతాలను నిత్యం శానిటైజ్‌ చేయాలి. పని ప్రాంతాల్లో షిఫ్ట్‌ మారే సందర్భంలో భౌతిక దూరం పాటించేందుకు చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి. కంటైన్‌మెంట్‌ జోన్లలో జులై 31వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: