లాక్ డౌన్ విధిస్తారా లేదా అనే సందేహం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ పెరిగిపోతోంది. ఒక వైపు చూస్తే కరోనా తీవ్రత తగ్గకపోగా, దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే స్థాయిలో కేసుల సంఖ్య పెరిగిపోతోంది. నేటితో ఐదో విడత లాక్ డౌన్ కూడా ముగిసి  పోతుండడంతో ప్రధాని నరేంద్రమోదీ ఏ నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే మరోసారి లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని, కొద్ది రోజుల క్రితం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో, ఈ విషయం అందరికీ అర్థమైపోయింది. లాక్ డౌన్ అమలు చేయకపోతే, కేసుల సంఖ్య మరింతగా పెరిగి పరిస్థితి అదుపు తప్పుతుంది అనేది ప్రజల అభిప్రాయం. 


ఇప్పటికే కేసుల సంఖ్య రోజుకు ఇరవై వేలు తక్కువ కాకుండా దేశవ్యాప్తంగా నమోదవుతున్నాయి. మరణాలు శాతం కూడా పెరిగిపోతుండడంతో పాటు సెప్టెంబర్ నాటికి ఆ సంఖ్య కోట్లకు చేరుతుందనే లెక్కలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో మరోసారి లాక్ డౌన్ విధించాలని అన్ని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడంతో, ఆసుపత్రిలో వసతులు కూడా కల్పించలేని పరిస్థితి ఏర్పడింది .నేటితో ఐదో విడత లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏ విషయాలపై స్పందిస్తారు అనే ఉత్కంఠ ఇప్పుడు జనాలు ఎక్కువగా ఉంది.


ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు సొంతంగా తమ తమ రాష్ట్రాల్లో కఠినంగా లాక్ డౌన్ ను అమలులోకి తీసుకు వచ్చాయి. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉండడంతో, దీనికి మించి మరో మార్గం లేదని, కేంద్రం నిర్ణయం కోసం ఎదురు చూస్తే, రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పుతుందనే అభిప్రాయంలో ఉన్నాయి. అలాగే కేంద్రం లాక్ డౌన్ విషయంలో వేగంగా స్పందించి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రేపు మీడియా ముందు వచ్చి ఏ ఏ విషయాల పై క్లారిటీ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: