ఇన్నాళ్లు హైదరాబాద్ ఆస్పత్రి అంటే నమ్మకం ఉన్న జనాలు ఇప్పుడు హైదరాబాద్ అంటే చాలు బెదిరిపోతున్నారు. బతుకుంటే శనగలు అమ్ముకొని అయినా బ్రతకచ్చు కానీ హైదరాబాద్ కి వెళ్లి కరోనా బారిన పడి చికిత్స అంధక చావకూడదు బాబోయ్ అని అంటున్నారు కొందరు హైదరాబాద్ ప్రియులు. 

 

మొన్నటి వరకు హైదరాబాద్ పై ఉన్న మమకారం అంత ఒక్క సెల్ఫీ వీడియోతో వెళ్లిపోయింది అని అంటున్నారు కొందరు. మొన్న ఆదివారం ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసింది. ఊపిరి ఆడట్లేదు అని చెప్పిన డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ చచ్చిపోతూ సెల్ఫీ వీడియో తీసి తండ్రికి బై బై చెప్పిన వీడియో ఇంకా మన మైండ్ లోనే ఉంది.

 

అలాంటిది ఆ వీడియో ఇంకా వైరల్ అవుతున్న సమయంలో హైదరాబాద్ ఎర్రగడ్డలోని చెస్ట్‌ ఆస్పత్రిలో మరో దారుణం చోటుచేసుకుంది. సరైన వైద్య సదుపాయాలు అందడం లేదని ఆరోపిస్తూ ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో విడుదల చేసిన కొద్దిసేపట్లోనే ప్రాణాలు విడిచాడు. అతనికి వైద్యం చేయడం లేదని సెల్ఫీ వీడియో తీసుకుని సయ్యద్‌ అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. 

 

 ఇంకా అతను నిన్న ఉదయం చనిపోయినప్పటికీ అతని మృతదేహాన్ని ఇప్పటివరకు ఆస్పత్రి సిబ్బంది కుటుంబ సభ్యులకు అప్పగించలేదని ఆరోపణలు వస్తున్నాయ్. అయితే రెండు నెలల క్రితం ఇటలీలో కరోనా వైరస్ విజృంభించిన సమయంలో వృద్దులను ఆస్పత్రిలోకి చేర్చుకొని విధంగా ఇప్పుడు హైదరాబాద్ లో కూడా జరుగుతుంది. రోజు రోజుకు మన దేశంలో కరోనా కేసులు పెరగడంతో ఆస్పత్రులు అన్ని ఫుల్ అవ్వడం.. వైద్యం అంధక ఇబ్బంది పడడం కంటే కూడా మనం ముందు నుండి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. బయటకు రాకుండా ఇంట్లోనే ఉండడం మంచిది. ఒకవేళ వచ్చిన మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరిగా ఉండాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: