చైనీస్‌ యాప్‌లకు భారత ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. సరిహద్దులో చైనాతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 59 సంస్థలకు చెందిన యాప్‌లపై నిషేధం విధించింది.  ప్రభుత్వం నిషేధం విధించిన వాటిలో టిక్‌టాక్‌, షేర్‌ ఇట్‌, యూసీ బ్రౌజర్‌, హలో, వీ చాట్‌, బ్యూటీ ప్లస్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి. దేశ రక్షణ, భద్రత దృష్ట్యా చైనా యాప్‌లపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది.  కాగా, చైనీస్‌ యాప్‌ల వల్ల వినియోగదారుల సమాచారం చోరీకి గురవుతుందనే వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు భారత్‌-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో చైనా యాప్‌లను నిషేధం విధించాలని సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున డిమాండ్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

 

 ఈ క్రమంలోనే 52 చైనా యాప్స్‌ను నిషేధించాలని ఇంటెలిజెన్స్‌ వర్గాలు కేంద్రాన్ని కోరాయి.అయితే జూన్ 15న గల్వాన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో 21 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు.అప్పటినుండి అక్కడ యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఆ కారణంగానే  భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే  ఓ వైపు చర్చలు, మరోవైపు బలగాలను మోహరిస్తున్న చైనాకు అదేరీతిన సమాధానం చెప్పాలని కేంద్రం భావిస్తోంది. అందువల్ల ఆ ప్రాంతంలో భారత్ కూడా సైనిక బలగాలను పెంచుతోంది.అంతేగాక, చైనా ఉత్పత్తులు, చైనా పేరుతో తయారై భారత్‌లో చెలామణిఅవుతున్న అనేక రకాల యాప్‌లు దేశ భద్రత, రక్షణకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నాయని తేలడంతో కేంద్ర ఈ మేరకు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. 

 

గత కొన్ని రోజుల ముందు ఇండియా - చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే.. అయితే వారికి ప్రతికారంగా భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని భారత ప్రజలు నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెరిగింది. చైనా తయారు చేసిన ఉత్పత్తులు, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టారు. గతంలోనూ పలువురు ఎంపీలు కూడా ఈ యాప్ లను నిషేధించాలని పార్లమెంట్ లో తమ గళం విప్పారు. ఇప్పుడు దీనిపైన కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: