వైసీపీ ఎంపీ రామకృష్ణంరాజు దాదాపుగా పార్టీకి దూరమయ్యాయి. రోజూ పార్టీని విమర్శిస్తూ తెలుగు దేశం అనుకూల మీడియాకు వరంగా మారారు. అయితే ఆ రాజు ఇష్యూను అడ్డం పెట్టుకుని వైసీపీని దెబ్బ తీసేందుకు తెలుగుదేశం అనుకూల మీడియా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

 

 

వైసీపీ శ్రేణుల్లో గందరగోళం తెచ్చేందుకు తమ వంతు కృషి చేస్తోంది. ఇప్పటికే అనేక మంది వైసీపీ ఎంపీలు బీజేపీలోకి వెళ్లిపోతున్నారంటూ ప్రచారం మొదలు పె‌ట్టింది. అంతే కాదు.. చిత్తూరు జిల్లాలోని వైసీపీ ఎంపీ దుర్గాప్రసాదరావు పార్టీ మారబోతున్నారంటూ తెలుగు దేశం అనుకూల మీడియా ఊదరగొట్టింది. దీంతో ఆ ఎంపీ పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చేశారు.

 

IHG

 

ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని ఎంపీ బల్లి దుర్గాప్రసాద రావు తేల్చి చెప్పారు. తాను పార్టీ మారుతున్నట్లుగా ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఎల్లో మీడియా కక్ష కట్టిందని, తప్పుడు కథనాలు ప్రసారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రలు పన్నుతోందని దుర్గాప్రసాదరావు మండిపడ్డారు.

 

 

చంద్రబాబే ఎల్లో మీడియాతో నాటకం ఆడిస్తున్నారని దుర్గాప్రసాదరావు ఫైరయ్యారు. నా ప్రాణం ఉన్నంత వరకు వైయస్‌ఆర్‌ సీపీని వీడను అని ఎంపీ దుర్గాప్రసాద రావు కుండబద్దలు కొట్టేశారు. అంతే కాదు.. తప్పుడు వార్తలు రాసిన వారిపై కేసులు పెడతానని వార్నింగ్ ఇచ్చేశారు. అయితే ఈ ఎంపీ ఇంత నిక్కచ్చిగా చెప్పేసినా.. ఎల్లో మీడియా తన ప్రచారం ఆపే అవకాశాలు లేవు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: